పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్స్.. ఫ్యాన్స్‌కు పండగే..?

Pawan Kalyan Trivikram: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ కాంబినేషన్ కుదుర్తుంటే మాత్రం పండగ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2020, 9:03 PM IST
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్స్.. ఫ్యాన్స్‌కు పండగే..?
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ (Pawan Kalyan Trivikram)
  • Share this:
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ కాంబినేషన్ కుదుర్తుంటే మాత్రం పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఉన్న ర్యాపో అలాంటిది మరి. సినిమాకు మించిన స్నేహం వాళ్లిద్దరి మధ్య ఉంది. పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడూ హీరోగా కాదు మంచి స్నేహితుడిగా చూస్తుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది, జల్సా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసాయి.

‘అజ్ఞాతవాసి’లో పవన్, వెంకటేష్ (Agnathavaasi)
‘అజ్ఞాతవాసి’లో పవన్, వెంకటేష్ (Agnathavaasi)


మూడో ప్రయత్నంగా వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు ఈయన. వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు పవర్ స్టార్. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కోసం అదిరిపోయే లైన్ ఒకటి త్రివిక్రమ్ సిద్ధం చేసాడని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ (Pawan Kalyan Trivikram)
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ (Pawan Kalyan Trivikram)

కచ్చితంగా ఈ సారి మాత్రం బాకీ తీర్చుకుంటానని.. అజ్ఞాతవాసి లెక్క భర్తీ చేస్తానని చెప్తున్నాడు మాటల మాంత్రికుడు. విభిన్నమైన కథ కథానాలతో పవన్ కథను మాటల మాంత్రికుడు సిద్ధం చేసాడని.. 2021 చివర్లో ఈ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు గురూజీ. అది పూర్తైన తర్వాత పవన్‌తో తన నాలుగో సినిమా చేయబోతున్నాడు ఈయన. అన్నీ అనుకున్నట్లు జరిగి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాక్సాఫీస్ దద్ధరిల్లిపోవడం ఖాయం.
Published by: Praveen Kumar Vadla
First published: June 13, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading