Pawan Kalyan - Tollywood Producers: పేర్నినాని భేటి తర్వాత పవన్ కళ్యాణ్‌‌తో టాలీవుడ్ నిర్మాతల భేటి అందుకోసమేనా..

పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటి (Twitter/Photo)

Pawan Kalyan - Tollywood Producers: పేర్నినాని భేటి తర్వాత పవన్ కళ్యాణ్‌‌తో టాలీవుడ్ నిర్మాతల భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
    Pawan Kalyan - Tollywood Producers: పేర్నినాని భేటి తర్వాత పవన్ కళ్యాణ్‌‌తో టాలీవుడ్ నిర్మాతల భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని వేధించుకు తింటుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు నిర్మాత, పోసాని పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు టాలీవుడ్ సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. ఐతే.. సినిమా నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. స్వయంగా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసి తమ కష్టాలను చెప్పుకోని.. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

    పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత తెలుగు నిర్మాతలు దిల్ రాజుతో కలిసి ఏపీ మంత్రి పేర్ని నాని కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానం కూడా తాము అడిగిందే అన్నారు. దయచేసిన సినీ ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగకండి అంటూ  చెప్పుకొచ్చారు.




    టికెట్ రేటు తక్కువగా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తమకు సినీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు  పేర్ని నాని. ఇక ఆన్‌లైన్ టికెట్ విధానం..  మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది కాదు' అంటూ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు టాలీవుడ్ సినీ నిర్మాతలు ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు.

    James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..


    ఈ సందర్భంగా ఈ రోజు  ఉదయం  టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

    Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

    చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు. వీళ్ల మధ్య ఎంతో ఉల్లాసపూరిత  సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను అస్సలు లాగొద్దని పవన్ కళ్యాణ్‌ను నిర్మాతలు కోరినట్లు తెలుస్తోంది. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: