Home /News /movies /

PAWAN KALYAN TO WORK WITH RAJAMOULI THATS PSPK VISITS RRR SETS TA

Pawan Kalyan - Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. ? అందుకే ఆర్ఆర్ఆర్ సెట్‌కు వకీల్ సాబ్..

రాజమౌళి, పవన్ కళ్యాణ్ Photo : Twitter

రాజమౌళి, పవన్ కళ్యాణ్ Photo : Twitter

Pawan Kalyan - Rajamouli: పవన్ కళ్యాణ్, అపజయం ఎగరని రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

    Pawan Kalyan - Rajamouli: పవన్ కళ్యాణ్, అపజయం ఎగరని రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. అందుకే పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ సెట్‌ను సందర్శించినట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే అక్కడ వేసిన లాడ్జ్ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుంది. దాని పక్కనే ఆర్ఆర్ఆర్ సెట్ ఉంది. పవన్ కళ్యాణ్ తాజాగా పక్కనే ఉన్న ఆర్ఆర్ఆర్ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.

    ప్రస్తుతం రాజమౌళి., ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. రాజమౌళి మహేష్ బాబు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.

    పవన్ కళ్యాణ్ రాజమౌళి (pawan rajamouli)
    పవన్ కళ్యాణ్ రాజమౌళి (pawan rajamouli)


    రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రాన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ అని చెబుతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ పై త్వరలో అఫీషియల్‌ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేసన్‌లో తెరకెక్కబోయే చిత్రం 2024లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న చిత్రలు కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. మరోవైపు అయ్యప్పనుమ్ కోషియమ్  సినిమా కూడా ఈ యేడాదే విడుదల కానుంది. ఇంకోవైపు క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల ప్రాజెక్ట్ ఉంది. ఆ తర్వాత రాజమౌళి, పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krish, Pawan kalyan, Rajamouli, Saagar K Chandra, Sriram Venu, Tollywood, Trivikram, Vakeel Saab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు