పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ (Bheemla Nayak)లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ టీజర్ విడుదలై అదరగొట్టింది. ఈ టీజర్ ఇటు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. జానపద స్టైల్లో నడిచిన ఈ పాట పవన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాయగా.. థమన్ స్వరపరిచారు.
ఇక అది అలా ఉంటే పవన్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు.. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ఓ పోస్టర్‌ను ప్రకటించారు.
Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 ? @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ ఇమేజీకి తగ్గట్టుగా వంశీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ సినిమా కథ గురించి.. ఇతర తారాగణం, టెక్నికల్ సిబ్బంది గురించి తెలియాల్సి ఉంది.
ఇక భీమ్లా నాయక్ విషయానికి వస్తే.. ఈ చిత్రంల పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, (Nithya menen) నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటలు అందిస్తుండగా, సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో.
ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Surender reddy, Tollywood news