Pawan Kalyan: ముచ్చటగా మూడోసారి.. అదే పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్
పవన్ కళ్యాణ్
పవన్ మరోసారి రీమేక్ మూవీకు సిద్ధమయ్యారు. ఇటీవలే మళయాళ సినిమాను భీమ్లా నాయక్‌గా రీమేక్ చేసిన పవర్ స్టార్.. ఈసారి తమిళ్ మూవీని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. పవన్ సినిమా వస్తుందంటే.. చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇక పవర్ స్టార్ ఏ రోల్ చేసిన కూడా చూసేందుకు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఓ తమ్ముడిగా.. బాధ్యతలేని కొడుకుగా, కాలేజీ కుర్రాడుగా, పోలీస్, నక్సలైట్‌గా ఇలా పవన్ సినిమాల్లో ఎన్నో రోల్స్ చేశారు. అయినా ఏ పాత్ర పోషించినా.. దాన్ని అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు. ఇక పోలీస్ పాత్రలో పవన్ చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. గబ్బర్ సింగ్, భీమ్లానాయక్ సినిమల్లో ఖాకీ డ్రెస్సులో పవర్ స్టార్ అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా యరోసారి పోలీస్ యూనిఫాం వేసుకునేందుకు సిద్దమవుతున్నాడు పవన్ కళ్యాణ్.
తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘తేరి’ రీమేక్‌కు పవన్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. విజయ్, సమంత నటించిన ఈ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆల్ రెడీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలయింది. అయినా కథపై నమ్మకంతో పవన్ రీమేక్ కి ఓకె చెప్పాడట. దీనికి ‘సాహో’ సుజీత్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.‘సాహో’ తర్వాత చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేయవలసిన సుజిత్ కి అది అందినట్లే అంది మిస్ అయింది. జయం రాజా దానిని ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘తేరీ’ రీమేక్ ని పవన్ తో చేసే ఛాన్స్ సుజిత్ కి దక్కిందట. దీనిని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నటు తెలుస్తోంది.
మరోవైపు పవర్‌స్టార్ కూడా మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ చేస్తాడని వినిపించినా అది వర్కవుట్ కాలేదు. ఇప్పడు ‘తేరి’ రీమేక్ కి పవన్ సై అంటే ఆయన అభిమానులు పవర్ స్టార్ ను మరోసారి పవర్ ఫుల్ ఖాకీ పాత్రలో చూసే అవకాశం దక్కింది. ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ మూవీలో నటించడానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.