Home /News /movies /

PAWAN KALYAN TO RELEASE ANCHOR SUMA KANAKALA JAYAMMA PANCHAYATHI MOVIE TRAILER SR

Anchor Suma : యాంకర్ సుమకు పవన్ కళ్యాణ్ సాయం.. ముహూర్తం ఫిక్స్..

Pawan Kalyan to release Anchor Suma Kanakala Jayamma Panchayathi movie trailer Photo : Twitter

Pawan Kalyan to release Anchor Suma Kanakala Jayamma Panchayathi movie trailer Photo : Twitter

Anchor Suma : తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటిస్తున్నారు. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వస్తోన్న ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మే 6న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది టీమ్.

ఇంకా చదవండి ...
    Suma Kanakala : యాంకర్ సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ సమీప భవిష్యత్తులో ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ (Suma Kanakala) స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి.

    తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటిస్తున్నారు. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వస్తోన్న ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌  (Ram Charan) ఆ మధ్య విడుదల చేశారు.








    View this post on Instagram






    A post shared by Suma K (@kanakalasuma)





    ఇక మరోవైపు ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో సుమ (Anchor Suma) చాలా ఈజ్‌తో కనిపిస్తుంది. కీరవాణి (Keeravani) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) వస్తుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 6న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది టీమ్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 11:07 గంటలకు ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Pawan kalyan, Suma Kanakala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు