రామ్ చరణ్‌తో పవన్ కళ్యాణ్ సినిమా.. మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Ram Charan Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. అందుకే వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే అది కేవలం డబ్బుల కోసమే చేస్తున్నాడు. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2020, 9:28 PM IST
రామ్ చరణ్‌తో పవన్ కళ్యాణ్ సినిమా.. మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ (pawan kalyan Ram charan)
  • Share this:
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. అందుకే వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే అది కేవలం డబ్బుల కోసమే చేస్తున్నాడు. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో కానీ సినిమా నిర్మాణంపై మాత్రం ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. మంచి క‌థ‌లు దొరికితే చిన్న సినిమాలు నిర్మించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు కాదు.. మూడేళ్ల కిందే తాను నిర్మాత‌గా మారుతున్న‌ట్లు చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాను తన సంస్థలోనే మొదలుపెట్టి ఆ తర్వాత బండ్ల గణేష్‌కు ఇచ్చాడు పవర్ స్టార్. త‌న సినిమాల‌నే కాకుండా చిన్న సినిమాల‌ను కూడా ఎంక‌రేజ్ చేయ‌డ‌మే త‌న ప‌ని అన్నాడు జ‌న‌సేనాని.

Pawan Kalyan all set to his first production and he will do his 1st movie with Ram Charan pk పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో కానీ సినిమా నిర్మాణంపై మాత్రం ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. మంచి క‌థ‌లు దొరికితే.. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan producer,pawan kalyan production,pawan kalyan ram charan movie,ram charan in pawan kalyan production,ram charan twitter,ram charan rrr movie shooting,ram charan rajamouli Jr ntr,pawan kalyan politics,pawan kalyan produce small movies,pawan kalyan janasena party,ram charan,pawan kalyan about ram charan,ram charan about pawan kalyan,pawan kalyan speech,pawan kalyan and ram charan,ram charan speech,pawan kalyan latest news,ram charan and pawan kalyan,ram charan kiss pawan kalyan,ram charan following pawan kalyan,powerstar pawan kalyan,ram charan love towards pawan kalyan,ram charan and pawan kalyan together,ram charan rangasthalam,telugu cinema,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,పవన్ నిర్మాణంలో రామ్ చరణ్,పవన్ రామ్ చరణ్ సినిమా,తెలుగు సినిమా
వినయ విధేయ రామ అజ్ఞాతవాసి

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ భారీ చిత్రానికి ప‌వ‌న్ శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా నిర్మించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. పీకే ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లో అన్న‌య్య గారి అబ్బాయితో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజానికి మూడేళ్ల కిందే ఈ కాంబినేష‌న్‌పై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. తాను రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమా నిర్మించ‌బోతున్నాన‌ని అప్ప‌ట్లో అనౌన్స్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. అనివార్య కారణాలతో ఇప్పటికీ అది పట్టాలెక్కలేదు.

Pawan Kalyan all set to his first production and he will do his 1st movie with Ram Charan pk పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో కానీ సినిమా నిర్మాణంపై మాత్రం ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. మంచి క‌థ‌లు దొరికితే.. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan producer,pawan kalyan production,pawan kalyan ram charan movie,ram charan in pawan kalyan production,ram charan twitter,ram charan rrr movie shooting,ram charan rajamouli Jr ntr,pawan kalyan politics,pawan kalyan produce small movies,pawan kalyan janasena party,ram charan,pawan kalyan about ram charan,ram charan about pawan kalyan,pawan kalyan speech,pawan kalyan and ram charan,ram charan speech,pawan kalyan latest news,ram charan and pawan kalyan,ram charan kiss pawan kalyan,ram charan following pawan kalyan,powerstar pawan kalyan,ram charan love towards pawan kalyan,ram charan and pawan kalyan together,ram charan rangasthalam,telugu cinema,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,పవన్ నిర్మాణంలో రామ్ చరణ్,పవన్ రామ్ చరణ్ సినిమా,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో
కాక‌పోతే ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో ప‌వ‌న్ బిజీ కావ‌డం.. చ‌ర‌ణ్ కూడా ఇత‌ర సినిమాల‌కు క‌మిట్ కావ‌డంతో ప‌వ‌న్, చ‌ర‌ణ్ సినిమా మూల‌న ప‌డిపోయింది. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ బాబాయ్ అబ్బాయి కాంబినేష‌న్ క‌లుస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది. ద‌ర్శ‌కుడి వివ‌రాలు త్వ‌ర‌లోనే రానున్నాయి. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ కచ్చితంగా పవన్, చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు