హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: తొలిసారిగా అలా.. పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోతుందంట!

Pawan Kalyan: తొలిసారిగా అలా.. పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోతుందంట!

భీమ్లా నాయక్ Photo : Twitter

భీమ్లా నాయక్ Photo : Twitter

ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతున్నట్లు... 80 శాతానికి పైగా షూటింగ్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా వస్తుందంటే  ఫ్యాన్స్‌కు పూనకాలే. భీమ్లా నాయక్(Bheemla Nayak) రిలీజ్ తర్వాత పవన్ మరో రెండు మూడు సినిమాల్ని లైన్‌లో పెట్టేశాడు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్‌(Harish Shankar)తో కలిసి పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబోలో 'భవదీయుడు భగత్ సింగ్' (Bhavadeeyudu Bhagath Singh)సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఒక న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. తాజాగా  ఈ సినిమాలో పవన్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఆయన లుక్ ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తికర విషయాలకు బయటకు వచ్చాయి.

సోషల్ మీడియా(Social Media)లో ఆయన పాత్రపై పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టారు హరీష్. ఆయన పాత్ర ఎమిటో.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఓ జాతీయ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు హరీశ్ శంకర్. 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి లెక్చరర్ పాత్రలో సందడి చేస్తారని.. అందమైన లుక్ లో పవన్ కనిపిస్తారని తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు... 80 శాతానికి పైగా షూటింగ్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చినా.. కరోనా కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హరీష్ దీనిపై చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హరీశ్ పవన్ కళ్యాన్ కలిసి చేసిన 'గబ్బర్ సింగ్'(Gabbar Singh) సినిమా హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చే 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ జన్మదినం సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమాలో నటిస్తున్నారు. జులై లోపు షూటింగ్ ను పూర్తి చేయాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది.

First published:

Tags: Bhavadeeyudu Bhagat Singh, Harish Shankar, Pawan kalyan

ఉత్తమ కథలు