Pawan Kalyan : మరో రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan : రీమేక్స్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ఇష్టమో తెల్సిందే. తన ఇమేజ్ కు సూట్ అవుతుంది. తాను ఆ పాత్రను చేయగలను అనుకుంటే పవన్ వెంటనే రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు.

news18-telugu
Updated: August 12, 2020, 7:06 AM IST
Pawan Kalyan : మరో రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
రీమేక్స్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ఇష్టమో తెల్సిందే. తన ఇమేజ్ కు సూట్ అవుతుంది. తాను ఆ పాత్రను చేయగలను అనుకుంటే పవన్ వెంటనే రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. పైగా ఇక బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ సజెస్ట్ చేస్తే ఇక ఆ రీమేక్ ను అస్సలే వదులు కోడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవర్ స్టార్ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో ప్రస్తుతం పవన్ నటించాలనుకుంటున్నాడట. నిజానికి ఈ రీమేక్ లో నటించాలని గతంలో డిసైడ్ అయ్యారు రానా, రవితేజ. ఒక ఇద్దరు వ్యక్తుల ఇగో సమస్యల వల్ల ఒక ఊరు ఎంత ఇబ్బంది పడింది. వారి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో అయ్యప్పనాయర్ గా బిజుమీనన్, కోషి కురీన్ పాత్రలో పృథ్విరాజ్ అద్భుతంగా నటించారు. తమ పాత్రలకు ప్రాణం పోసారు. సరాసరి 3 గంటల చిత్రమిది. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ పై పవన్ మనసు పడ్డాడు. రీసెంట్ గా మూవీ చూసి రీమేక్ లో నటించాలని ఉందని సన్నిహితులకు తెలిపాడట. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ దగ్గర ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే హారికా హాసిని అనుబంధ సంస్థ ఇది. దాంతో ఇప్పుడు ఈ రీమేక్ చేతులు మారే అవకాశం కనిపిస్తోంది.

venkatesh will remake ayyappan koshiyum movie with rana daggubati after narappa movie,venkatesh,rana,rana daggubati venkatesh,venkatesh,balakrishna,venkatesh rana multistarer,venkatesh ayyappan koshiyum remake,balakrishna will remake ayyappan koshiyum moive,naarappa,venkatesh naarappa,venaktesh naarappa dhanush asuran remake,venkatesh remake movies,venkatesh remake,Venkatesh,Venkatesh asuran,asuran movie collections,asuran movie review,dhanush asuran movie,dhanush asuran movie review,asuran telugu remake,asuran remake,venkatesh asuran movie,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ అసురన్,అసురన్ రీమేక్,అసురన్ తెలుగు రీమేక్,తెలుగు సినిమా,వెంకటేష్ రీమేక్ కహాని,నారప్ప,నారప్ప వెంకటెష్,అసురన్ రీమేక్ నారప్ప,వెంకటేష్ అయ్యప్పన్ కోషియమ్ మూవీ,వెంకటేష్ రీమేక్ అయ్యప్పన్ కోషియమ్ మూవీ,వెంకటేష్ రానా అయ్యప్పన్ కోషియమ్ మూవీ రీమేక్
రానా, వెంకటేష్ Photo : Twitter


పవన్ కోరితే మాత్రం ఈ రీమేక్ ను ఆయన చేతుల్లో పెట్టడానికి రవితేజ, రానాకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. పైగా మూవీలో మరో హీరోకి నటించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిలోనే మరొకరికి సినిమలో నటించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు పవన్. ఈ రీమేక్ కూడా త్రివిక్రమ్ చెబితేనే చేస్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ విక్రమ్ వేదా రీమేక్ లో కూడా పవన్ నటించాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే పవర్ స్టార్ రీమేక్ లిస్ట్ అంతకంతకూ పెరుగుతున్నట్లే లెక్క. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పై టాలీవుడ్ లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ లో బాలయ్య నటిస్తాడని టాక్ వినిపించింది. ఆ తర్వాత రానా, వెంకటేష్ కాంబోలో రీమేక్ అన్నట్లు టాక్ వచ్చింది.  ఇప్పుడు పవర్ స్టార్ ఎంట్రీ ఈ రీమేక్ ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
Published by: Suresh Rachamalla
First published: August 12, 2020, 6:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading