పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తాజాగా పవన్ మరో సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు వేణు ఊడుగులతో (Venu udugula) పవన్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. దర్శకుడు వేణు ఊడుగుల ప్రస్తుతం రానాతో విరాటపర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో(Rana Daggubati) రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. తాజాగా భీమ్లా నాయక్ అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. భీమ్లా నాయక్ (Bheemla Nayak) విషయానికి వస్తే... ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించారు.
ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ పాన్ ఇండియా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది టీమ్. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రం షూట్ ఏప్రిల్ 6 నుంచి రెస్యూమ్ కానున్నట్టు టాక్. ఈ షెడ్యూల్ కోసం కూడా టీమ్ భారీ సెట్టింగ్స్ సిద్ధం చేశారట. అంతేకాదు ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసే యోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక అది అలా ఉంటే ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు.
Krithi Shetty: మత్తైనా చూపులతో మాయ చేస్తోన్న కృతి శెట్టి.. వైరల్ అవుతోన్న పిక్స్..
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను (Surender Reddy) సురేందర్ రెడ్డితో చేస్తున్నట్లు ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మాతగా . సురేందర్ రెడ్డి (Surender Reddy), వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కథ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోయిందని టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.