పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటి సంగతే ఇంకా తేలలేదు. అప్పుడే ఆ తర్వాత తీయబోయే సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఔను. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అది రాబిన్ హుడ్ తరహాలో ఉండనుంది. అది పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్లో సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తీయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు అన్నీ పూర్తయిన తర్వాత మరో కొత్త సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డైరెక్షన్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.
ప్రస్తుతం కొణిదెల్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా వస్తోంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే పవర్ స్టార్ సినిమా రెడీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ తన సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి చూస్తున్నాడు. తనకు సంబంధించిన షూటింగ్ మినహా మిగిలినవి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేస్తే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకోనున్నాడు.
తాను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు జానీ మాస్టర్ గతంలో పలుమార్లు తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే, అది పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటే ఆ కిక్కే వేరు అని అతడు ఆశగా ఉన్నాడు. జానీ మాస్టర్ రెడీ చేసే స్రిప్ట్కు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు తెలిసింది. ఇక రామ్ చరణ్ కూడా బాబాయ్‌తో సినిమా తీయాలని తెగ ఉత్సాహంగా ఉన్నాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:November 30, 2020, 14:50 IST