• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN THREE MARRIAGES UNKOWN FACTS ABOUT HIS FRIST NANDINI SA

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా!

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా!

pawan kalyan wife

నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశారు.

  • Share this:


    పవన్ కళ్యాణ్.. తెలుగు సీని అభిమానుల సుపరితమైన పేరు. మాస్ ఐడియాలజీ వేలాది మందిని తన వైపు ఆకర్షించుకునేలా చేశాడు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతూ.. అటూ రాజకీయాలు.. ఇటు సినిమాలు చేస్తూ ఎప్పుడు ట్రేడింగ్ నిలుస్తుంటాడు. అయితే 2014లో రాయకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్.. జనసేన పార్టీని స్థాపించి చురుకుగా ప్రజల్లోకి వెళుతున్నాడు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికి పాలిటిక్స్‌లో నిలదొక్కుకున్నాడు. అతనిపై ఎలాంటి రాజకీయ మచ్చలు లేకపోవడంతో తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ పెళ్ళిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేశాయి. మూడు పెళ్ళిలు చేసుకున్నడంటూ పదేపదే పవన్‌ను కించపరుస్తూ వచ్చాయి.

    ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగస్టార్ చీరంజీవి తమ్ముడిగా చిత్ర సినిమాలోకి అడుగు పెట్టారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. బద్రి,ఖుషీ,తమ్ముడు,తొలిప్రేమ,గుడుంబా శంకర్,బాలు,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోగా ఎదిగారు.



    పవన్ 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మెుదటిగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడువలు రావడం.. చివరకు అది విడాకుల వరకు వెళ్ళింది.

    నందిని.. వవన్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తర్వాత 2008లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశారు. వారికి ఇద్దరూ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో కూడి విడిపోయి ర‌ష్యన్ న‌టి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు

    పవన్‌తో విడిపోయిన రేణూ దేశాయి ప్రస్తుతం పుణేలో ఉంటూ నిర్మాత వ్వవహారిస్తూ.. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో గెస్ట్‌గా కనిపిస్తున్నారు. ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణా రెడ్డిని వివాహమాడింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు