news18-telugu
Updated: April 20, 2020, 2:01 PM IST
రాజమౌళి, పవన్ కళ్యాణ్ Photo : Twitter
రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఓ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరీస్ వీళ్లకు జంటగా నటిస్తున్నారు. హిందీ నటుడు అజయ్ దేవ్ గన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జనవరి 08 2020లో ఈ సినిమా విడుదల కావాల్సివుంది. అందులో భాగంగా ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా పూనేలో జరగాల్సిన షెడ్యూల్ ప్రస్తుతం వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం ఖాళీగా వుంటున్న రాజమౌళి పలు టీవీ ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. ఆయన సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. 'మరోవైపు, నేనేమో రోజుల కొద్దీ సినిమాలు తీస్తుంటాను. దీంతో పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్‌కు సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న భావన 100 శాతం ఉంటే.. నాలో అది మాత్రం 0.5 ఉంటుంది. ఆయన ఆలోచన వేరు.. నా దృక్పథం వేరని పేర్కోన్నాడు. అందులో భాగంగా ఆయనతో కలిసి సినిమా తీసే అవకాశాలు లేవని రాజమౌళి పేర్కోన్నాడు.
Published by:
Suresh Rachamalla
First published:
April 20, 2020, 2:01 PM IST