పవన్ పేరును ప్రైవేట్ పార్టులో పచ్చబొట్టు వేయించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..

Ashu Reddy: బండ్ల గణేష్, నితిన్ లాంటి వాళ్లు కూడా పవన్ భక్తులం మేం అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఓ ముద్దుగుమ్మ తనకు పవన్ అంటే ప్రాణం అంటుంది. బిగ్ బాస్ షోతో పాపులర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 10:12 PM IST
పవన్ పేరును ప్రైవేట్ పార్టులో పచ్చబొట్టు వేయించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..
పవన్ కళ్యాణ్ అశు రెడ్డి (pawan kalyan ashu reddy)
  • Share this:
పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలోనే చాలా మంది అభిమానులున్నారు. ఏం విచిత్రమో తెలియదు కానీ చాలా మందికి అభిమానులుంటారు కానీ పవన్ విషయంలో మాత్రం అది దాటిపోతుంది. అభిమానం కూడా హద్దులు దాటేసి భక్తులు కూడా ఉంటారు. బండ్ల గణేష్, నితిన్ లాంటి వాళ్లు కూడా పవన్ భక్తులం మేం అని చెప్పుకుంటారు. చిరంజీవి లాంటి హీరోకు కూడా లేని ఫాలోయింగ్ ఓ సమయంలో పవన్ సంపాదించుకున్నాడంటే అతిశయోక్తి అయితే కాదు. ఓ ముద్దుగుమ్మ తనకు పవన్ అంటే ప్రాణం అంటుంది.

పవన్ కళ్యాణ్, అశు రెడ్డి (pawan kalyan ashu reddy)
పవన్ కళ్యాణ్, అశు రెడ్డి (pawan kalyan ashu reddy)


అందుకే పచ్చబొట్టు కూడా వేయించుకున్నానని చెబుతుంది ఈమె. చాలా మంది హీరోయిన్లు తమకు పవన్ అంటే ప్రాణం అని చెబుతారు.. అందులో ఎవరబ్బా అనుకుంటున్నారా..? బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన అశు రెడ్డి గుర్తుందా.. ఆమె గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో బయట కూడా బాగానే హడావిడి చేసింది. షో లో ఉన్నపుడు కూడా పవన్ నామజపం చేస్తూ అభిమానుల ఓట్లు సంపాదించాలని చూసింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

పవన్ కళ్యాణ్, అశు రెడ్డి (pawan kalyan ashu reddy)
పవన్ కళ్యాణ్, అశు రెడ్డి (pawan kalyan ashu reddy)


మొన్నామధ్య మరోసారి ఇలాంటి పనే చేసింది. ఓ షోకు వచ్చినపుడు పవన్ పచ్చబొట్టు గురించి చెప్పుకొచ్చింది అశు రెడ్డి.  అది కూడా ప్రైవేట్ పార్టులో పవన్ పేరు పచ్చ పొడిపించుకుంది. అందులో ఓ టాస్కులో భాగంగా పవన్ పచ్చబొట్టు తీయించుకుంటావా.. లేదంటే పవన్ సినిమాలో ఆఫర్ వస్తే వదిలేస్తావా అని యాంకర్ అడిగితే మరో ఆలోచన లేకుండా సినిమా వదిలేసుకుంటానని చెప్పింది అశు. ఎందుకు పవన్ అంటే అంత పిచ్చి అంటే తెలియదు.. నేను ఆయన అభిమానిని కాదు భక్తురాలుని అంటూ సమాధానమిచ్చింది అశు రెడ్డి.

పవన్ కళ్యాణ్ అశు రెడ్డి (pawan kalyan ashu reddy)
పవన్ కళ్యాణ్ అశు రెడ్డి (pawan kalyan ashu reddy)


చిన్నప్పట్నుంచి పవన్ అంటే పిచ్చి కాదు ప్రాణం అంటుంది ఈమె. మొత్తానికి ఒంటిపై చెరిగిపోని పచ్చబొట్టు వేయించుకుందంటే పాప ఎంతగా పవన్ కళ్యాణ్‌కు ఫిదా అయిపోయిందో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి. ఏదేమైనా కూడా పవన్ అంటే మాత్రం తనకు ప్రాణం అంటుంది ఈ బ్యూటీ.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading