హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోయిందా... కారణం అదేనా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోయిందా... కారణం అదేనా..

Surender Reddy Pawan Kalyan Photo : Twitter

Surender Reddy Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఓ సినిమాను హరీష్ శంకర్‌తో, మరో సినిమాను సురేందర్ రెడ్డితో చేస్తున్నారు. కాగా.. సురేందర్ రెడ్డితో చేస్తోన్న సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

    Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. భీమ్లానాయక్ (Bheemla Nayak) ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అదరగొట్టింది. ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి.. లాభాల బాటలో ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్‌ ఇంకా కాలేదు. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఓ సినిమాను హరీష్ శంకర్‌తో, మరో సినిమాను (Surender Reddy) సురేందర్ రెడ్డితో చేస్తున్నారు. కాగా.. సురేందర్ రెడ్డితో చేస్తోన్న సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా . సురేందర్ రెడ్డి (Surender Reddy), వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కథ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోయిందని అంటున్నారు.

    ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

    ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

    ఇక భీమ్లా నాయక్ విషయానికి వస్తే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహా కూడా భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా మార్చి 25న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసింది టీమ్. అయితే కొన్ని కారణాల వలన అక్కడ విడుదలకాలేదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటించారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan

    ఉత్తమ కథలు