అభిమాని కోసం బౌన్సర్లకు... పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

దీంతో వెంటనే అక్కడున్న బాడీగార్డ్స్ అంతా అతడ్ని పట్టుకొని ఆపే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ వెంటనే వారిని ఆపి అతడ్ని వదలమన్నారు. బౌన్సర్లను గట్టిగా గద్దించారు.

news18-telugu
Updated: September 23, 2019, 4:28 PM IST
అభిమాని కోసం బౌన్సర్లకు... పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
బౌన్సర్లపై సీరియస్ అవుతున్న పవన్ కల్యాణ్
  • Share this:
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టేజ్‌పై పవన్ మాట్లాడుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతుంటే... ఒక్కసారిగా ఓ వ్యక్తి స్టేజ్‌పైకి ఎక్కి పవన్ కల్యాణ్ కాళ్లపై పడిపోయాడు. దీంతో వెంటనే అక్కడున్న బాడీగార్డ్స్ అంతా అతడ్ని పట్టుకొని ఆపే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ వెంటనే వారిని ఆపి అతడ్ని వదలమన్నారు. బౌన్సర్లను గట్టిగా గద్దించారు. ఆప్ లోగ్ చలే జాయియే అంటూ పవన్ కల్యాణ్ వారిపై సీరియస్ అయ్యారు. బౌన్సర్లు అభిమానిని వదలకపోవడంతో మరోసారి వారిపై గట్టిగా అరిచారు. చలియే ఆప్ అంటూ మరోసారి వారిపై ఫైర్ అయ్యారు పవన్.  ఆ తర్వాత తన కోసం వచ్చిన అభిమానిని గట్టుకొని హత్తుకున్నారు. అతని భుజంపై తట్టి పంపించారు.
 View this post on Instagram
 

#PawanKalyan ❤🔥🙏 His love & Respect for his Fans! 🙏🙏🙏


A post shared by Pawan Kalyan 🌀 (@pawankalyanfans) on
First published: September 23, 2019, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading