గత కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. కాస్తంత గ్యాప్‌లో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ రీమేక్‌లో నటించబోతున్నట్టు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా చేస్తుంది లేనది మాత్రం నోరు విప్పి క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే దర్శకుడు శ్రీరామ్ వేణు, తమన్‌లతో కలిసి దిల్ రాజు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ తమన్ మొదలు పెట్టినట్టు తెలిపారు.
ఈ సినిమాలో పవన్ సరసన నయనతారను అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో పూజా హెగ్డే లేదా నివేధా థామస్‌ను అనుకుంటున్నారు.ఫైనల్‌గా ఎవరు యాక్ట్ చేస్తారో చూడాలి. అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర ముఖ్యపాత్రలను ఎంపిక చేసే పనిలో పడ్డారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ రీమేక్ దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న 40వ సినిమా. ఇక ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొత్తానికి ‘పింక్’ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఇంకా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంపై మౌనం వీడకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boney Kapoor, Dil raju, Pawan kalyan, Pink, Sriram Venu, Telugu Cinema, Thaman, Tollywood