HOME » NEWS » movies » PAWAN KALYAN SON AKIRANANDAN CELEBRATES SANKRANTI IN CHIRANJEEVI FAMILY SK

చిరంజీవి ఇంట్లో పవన్ కొడుకు సందడి.. ఫొటోలు వైరల్

చిరు ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పవన్ లేకుంటే ఏంటి..? ఆయన పెద్ద కొడుకు అకిరా సందడి చేశాడు.. అది చాలంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

news18-telugu
Updated: January 16, 2020, 3:47 PM IST
చిరంజీవి ఇంట్లో పవన్ కొడుకు సందడి.. ఫొటోలు వైరల్
చిరంజీవి, అకిరా నందన్
  • Share this:
అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాయి. చిరు నివాసంలో మెగా హీరోలంతా సందడి చేసి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సంబరాల్లో అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్, వైష్టవ్ తేజ్ పాల్గొన్నారు. ఐతే అందులో చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ మాత్రం మిస్సయ్యారు. ఇద్దరూ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీతో పండగను సెలబ్రేట్ చేసుకోలేకపోయినట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కల్యాణ్ బీజేపీతో చర్చలు నేపథ్యంలో ఆయన సంక్రాంతికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చిరంజీవి ఇంటికి రాలేకపోయారు.

ఐతే పవన్ కల్యాణ్ లేని లోటును ఆయన పెద్ద కుమారుడు అకిరా నందన్ తీర్చాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అకిరా సందడి చేశాడు. పెద్దనాన్నతో పాటు అన్నలు రాంచరణ్, వరుణ్ తేజ్‌తో కలిసి పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరూ పండగను జరుపుకుంటుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రజల కోసం రోడ్లపై తిరుగుతున్నాడని పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. చిరు ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పవన్ లేకుంటే ఏంటి..? ఆయన పెద్ద కొడుకు అకిరా సందడి చేశాడు.. అది చాలంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

చిరు ఇంట్లో సంక్రాంతి వేడుకలు, రాజకీయాల్లో పవన్ బిజీ
Published by: Shiva Kumar Addula
First published: January 16, 2020, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading