దర్శకు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖులంతా ప్రశంసలు కురిపించారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని భాషాల్లో హిట్ అయ్యింది. అయితే ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr) లతో తీశారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Raja mouli) ఈ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” గా తెరకెక్కించారు. ఈ సినిమా ఇపుడు ఓటిటి లో కూడా వచ్చి అదరగొడుతుండగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఇంకో వార్త హల్ చల్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ పాటకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీర నందన్ అదిరిపోయే ఫెర్ ఫామెన్స్ ఇచ్చాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సోమవారం తన స్కూల్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకోగా ఆ ఈవెంట్ కి గాను రేణు దేశాయ్ తో పాటు పవన్ పాల్గొన్నారు. అంతేకాకుండా తమ ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగడంతో ఆ ఫ్రేమ్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఇదే ఈవెంట్ లో అకీరా RRR సినిమాలోని దోస్తీ సాంగ్ ని పియానో పై వాయించి తన మరో టాలెంట్ ప్రదర్శితం చేసాడు. దీనితో ఈ వీడియో ఇప్పుడు పవన్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అకీరపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ.. అభినందనలు తెలుపుతున్నారు.
#AkiraNandan playing #RRRMovie dosti song on his school graduation ceremony Day!
@PawanKalyan @AlwaysRamCharan pic.twitter.com/uJW0UPlpV6
— Trends AKIRA™ (@TrendsAKIRA) May 23, 2022
తాజాగా అకీరా.. మహేష్ బాబు సూపర్ హిట్ పాటను కూడా పియానోపై వాయించాడు. మహేష్ బాబు ఇటీవలే నటించిన సర్కారు వారి పాట సినిమాలో.. కళావతి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.ఆ సాంగ్‌ను అకీర పియానోపై వాయించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. దీంతో అకీర టాలెంట్ చూసి.. పవన్ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. త్వరలో అకీర కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అంచనాలు వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akira nandan, Pawan kalyan, RRR