పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. అకీరా టాలెంట్ గురించి అభిమానులకు తెలిసిందే. అకిరా(Akira Nandan) వెండితెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరగా పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. అయితే అకీరాక తండ్రి పవర్ స్టార్ లాగానే.. సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. కాబోయే మెగా హీరోగా ఈయనను ఫ్యాన్స్ స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే అకిరా యాక్టింగ్ మాత్రమే కాదు కరాటే, సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు..గతంలో దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది వరకు పవన్ కళ్యాణ్ స్వయంగా కుమారుడిని మ్యూజిక్ క్లాసులకు సైతం తీసుకు వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి.. తాజాగా అకిరా టాలెంట్ ఉన్న కీబోర్డ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. అకిరా కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాలోని కళావతి సాంగ్ ను ప్లే చేస్తూ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీప్ ఇట్ అప్ అకీరా అంటూ పోస్టులు పెడ్డుతున్నారు. కొందరు అద్భుతం అంటూ అకీరాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు జూనియర్ తమన్ అంటూ... కామెంట్స్ చేస్తున్నారు.
అకీరా టాలెంట్ చూసి మీద అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ సాంగ్ ను పవర్ స్టార్ వారసుడు ప్లె చేయడం పై మహెష్ బాబు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా ఇప్పటికే ఈయన సిల్వర్ స్క్రీన్ మీద తల్లి రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన ఇష్క్ వాలా లవ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇది ఒక మరాఠి సినిమా.. ప్రెసెంట్ సినిమాల విషయం పక్కన పెట్టి చదువు పైనే శ్రద్ధ పెట్టాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.