Home /News /movies /

PAWAN KALYAN SON AKIRA NANDAN MAKING TOLLYWOOD GRAND ENTRY HERE ARE THE DETAILS SR

Pawan Kalyan : టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా... తండ్రి కొడుకులు ఒకే సినిమాలో..

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు (hari hara veeramallu) ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు. కొద్ది రోజుల షూటింగ్ జరుపుకున్నఈ చిత్రం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఇంకా చదవండి ...
  పవన్ కళ్యాణ్.. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు (hari hara veeramallu) ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు. కొద్ది రోజుల షూటింగ్ జరుపుకున్నఈ చిత్రం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (akira nandan) టాలీవుడ్ ఏంట్రీ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో అకీరా కోసం ఓ అదిరిపోయే పాత్రను క్రిష్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక తండ్రి, కొడుకులు ఒకే ఫ్రేములో క‌నిపిస్తే ఇక ఆ సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అకీరా ఇప్పటికే మరాఠీలో ఓ సినిమా చేశారు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా బాల్య నటుడుగా నటించారు.

  ఇక కొద్ది రోజులుగా భీమ్లా నాయక్  (Bheemla Nayak)చిత్రంతో బిజీగా ఉన్న పవన్ త్వరలో 'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇక ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది హరిహర వీరమల్లు.

  Balakrishna : బాలకృష్ణ‌ సరసన తమిళ సూపర్ స్టార్ కూతురు.. ఫైనల్ చేసిన గోపీచంద్..

  ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదలవుతోంది. ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. సినిమా కంప్లీట్ గా 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని పవన్ పాత్ర కూడా రాబిన్ హుడ్ తరహాలో చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు క్రిష్ తెలియజేశాడు.. ఇప్పటివరకు తెలుగులోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూడలేదని కూడా ఈ దర్శకుడు నమ్మకంగా తెలియజేశాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.

  Anchor Sreemukhi : పొట్టి స్కర్టులో పిచ్చెక్కించిన యాంకర్ శ్రీముఖి.. వావ్ అనాల్సిందే...

  ఇక ఆ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్.

  ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. (Rana daggubati) రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే పేరును ఖరారు చేశారు, త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్తా మీనన్, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akira nandan, Hari hara veeramallu, Pawan kalyan, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు