Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 7, 2019, 1:32 PM IST
తండ్రి పవన్ కళ్యాణ్‌తో అకిరా నందన్ (Akira Nandan)
పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు మానేసాడనే బాధ వాళ్లలో కనిపిస్తుంది. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు ఉండే పండగ వేరు. పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఈయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram
పవన్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆరడుగుల హైట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జూనియర్ పవర్ స్టార్. ఈ మధ్యే బయటికి వచ్చిన అకీరా ఫోటోలు చూసి ఫ్యాన్స్ పరేషాన్ అయ్యారు. పవన్ కల్యాణ్‌ను కూడా మించిపోయాడు అకీరా. వరుణ్ తేజ్ హైట్ కూడా అకీరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఈయన తొలి సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అకీరా నందన్
దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటికి రానున్నాయి. ఒకవేళ పవన్ వారసుడి ఎంట్రీ ఖరారైతే దాన్ని ఎవరు నిర్మిస్తారు.. దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని తెలుస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 7, 2019, 1:32 PM IST