PAWAN KALYAN SLEPT WHEN TRIVIKRAM SRINIVAS NARRATED HIM ATHADU MOVIE STORY PK
మహేష్ బాబు సినిమా కథ విని పడుకున్న పవన్ కళ్యాణ్..
దానికి తోడు పవన్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా 50కి అటూ ఇటూగా ఉన్నారు. ఇంకా చాలా మంది హీరోల వయసు కూడా 40కి చేరువలోనే ఉంది. కుర్ర హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు.
నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మహేష్ సినిమా కథ విని పడుకున్నాడు పవన్. అది మరేదో కాదు.. అతడు సినిమానే. మహేష్ బాబు కెరీర్లో ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మహేష్ సినిమా కథ విని పడుకున్నాడు పవన్. అది మరేదో కాదు.. అతడు సినిమానే. మహేష్ బాబు కెరీర్లో ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ అతడు ఓ క్లాసిక్. టెలివిజన్‌లో అతడు సృష్టించిన రికార్డులు అయితే బహుశా మరే సినిమాకు కనీసం సాధ్యం కూడా కావేమో..? త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం 2005లో విడుదలైంది. అప్పటి వరకు మురారి, ఒక్కడు లాంటి విజయాలతో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో నటుడిగానే కాకుండా స్టార్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మురళీ మోహన్ నిర్మించిన అతడు థియేటర్లలో అంత విజయం సాధించలేదు కానీ టీవీలో మాత్రం ఆల్‌టైమ్ హిట్.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ (File Photo)
ఈ చిత్ర కథ ముందు మహేష్‌కు కాకుండా పవన్ కల్యాణ్‌కు చెప్పాడు మాటల మాంత్రికుడు. అప్పటికి నువ్వే నువ్వే లాంటి హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అయితే దానికంటే ముందే అతడు కథను పవన్‌కు చెప్పాడు.. కానీ ఆ కథ చెప్పేటప్పుడు పవన్ కల్యాణ్ పడుకున్నాడు.. ఈ నిజాన్ని చెప్పింది కూడా త్రివిక్రమే. వెనక గోడ సపోర్ట్ కూడా లేకుండా కేవలం స్టూల్‌పై కూర్చుని పడుకున్నాడు పవర్ స్టార్. ఆ తర్వాత మహేష్ బాబుకు ఈ కథ చెప్పాడు త్రివిక్రమ్.
పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్
అప్పుడు ఆయన ఓకే అన్నాడు. అయితే ఒక్కడు ఒప్పుకోవడంతో.. ఈలోపు నువ్వే నువ్వే పూర్తి చేసుకుని వచ్చి అతడు సినిమా చేసాడు మాటల మాంత్రికుడు. అలా పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న సినిమాను మహేష్ బాబు కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాను అందుకున్నాడు. ఏదేమైనా కూడా అతడు లాంటి స్క్రిప్ట్ చెబుతుంటే పవన్ పడుకోవడం మాత్రం నిజంగానే విడ్డూరం. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు చేసాడు పవన్ కళ్యాణ్.