బోనీ కపూర్ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్..

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తీరుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 6, 2019, 9:38 AM IST
బోనీ కపూర్ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్..
పవన్ కళ్యాణ్,బోనీ కపూర్ (File Photos)
  • Share this:
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తీరుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. తాజాగా మొన్నీ మధ్య పవన్ కళ్యాణ్.. హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు బాలీవుడ్ మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్‌తో ట్వీట్ చేయించడంపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు  డైరెక్ట్ చేయబోతున్న ఈసినిమాను దిల్ రాజు‌తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ మాటలు రాయడమేది ఖరారైంది.ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నయనతార, తమన్నా, పూజా హెగ్డే‌ను  తీసుకోవాలన్న బోనీ కపూర్ సూచనలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం. అసలు నా పర్మిషన్ తీసుకోకుండా... ఈ ప్రాజెక్ట్‌ను ఎలా అనౌన్స్ చేస్తారని మండిపడ్డట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా కోసం నేను.. రూ.50 కోట్లు పారితోషకం తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై కూడా సీరియస్ అయినట్టు సమాచారం. అంతేకాదు తన కెరీర్‌లో ఏ నిర్మాతను ఎపుడు రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. అలాంటి తన వ్యక్తిత్వంపై నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేసిన ఈ పారితోషకం వార్తలను ఎందుకు ఖండించలేదని పవన్.. బోనీ కపూర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.

pawan kalyan serious about boney kapoor dil raju for the pink telugu remake issue,pawan kalyan,boney kapoor,pawan kalyan boney kapoor,pawan kalyan serious about boney kapoor dil raju,pink remake,pawan kalyan new movie,pawan kalyan latest news,pawan kalyan pink remake,pawan kalyan speech,power star pawan kalyan,jhanvi kapoor,pawan kalyan next movie,pawan kalyan movies,pawan kalyan live,pawan kalyan fans,sridevi and boney kapoor,pawan kalyan re entry,pawan kalyan re entry in movies,pawan kalyan long march,pawan kalyan songs,pawan kalyan pink,pawan kalyan craze,pawan kalyan twitter,pawan kalyan instagram,boney kapoor twitter,boney kapoor instagram,పవన్ కళ్యాణ్,దిల్ రాజు,బోనీ కపూర్,దిల్ రాజు బోనీ కపూర్,బోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్,బోనీ కపూర్ పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్
దిల్ రాజు,బోనీ కపూర్ (Twitter/Photo)


మరోవైపు ‘పింక్’ సినిమా చూసి ఈ  కథ తనకు నచ్చింది అని చెప్పాను. ..కానీ ఈ రీమేక్‌లో నటిస్తానని మీకు చెప్పలేదన్నడా. కేవలం ఆలోచిస్తాను అని చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని తాను ఈ రీమేక్‌లో నటిస్తున్నట్టు ఎందుకు ప్రచారం చేసారని దిల్ రాజు,బోనీ కపూర్‌లపై మండిపడ్డట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక సెట్‌ను నిర్మించడానాికి ఒక ఫ్లోర్‌ను బుక్ చేసారన్న వార్తలపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అపంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలన్ని త్రివిక్రమ్ దృష్టికి వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ కోసం ఫారిన్‌లో ఉన్న త్రివిక్రమ్.. తాను తిరిగొచ్చే వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి లీకులు ఇవ్వద్దని నిర్మాతలకు చెప్పాడట. అంతేకాదు తాను పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన మనుసులో సినిమా చేయాలనుందో లేదో తెలుసుకుంటానిని చెప్పాడు. ఈ విషయమై దిల్ రాజు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. ఏమైనా పవన్ కళ్యాణ్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయంపై ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది పరిస్థితి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 6, 2019, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading