Home /News /movies /

PAWAN KALYAN SENT SPECIAL BIRTHDAY GREETINGS TO HIS NEW MOVIE DIRECTOR KRISH JAGARLAMUDI PK

Pawan Kalyan birthday wishes to Krish: దర్శకుడు క్రిష్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్..

క్రిష్ పవన్ కళ్యాణ్ (Krish Pawan Kalyan)

క్రిష్ పవన్ కళ్యాణ్ (Krish Pawan Kalyan)

Pawan Kalyan birthday wishes to Krish: కమర్షియల్ హంగులలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని సరైన గమ్యం దిశగా అడుగులు వేసేలా చేస్తున్న దర్శకుడు క్రిష్. డబ్బులు కాదు విలువలే నాక్కావాలి అంటూ సినిమాలు చేస్తుంటాడు ఈయన.

కమర్షియల్ హంగులలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని సరైన గమ్యం దిశగా అడుగులు వేసేలా చేస్తున్న దర్శకుడు క్రిష్. డబ్బులు కాదు విలువలే నాక్కావాలి అంటూ సినిమాలు చేస్తుంటాడు ఈయన. చేసింది తక్కువ సినిమాలే కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్. స్టార్ హీరోలకు కూడా ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ అధినాయకుడు, మహానాయకుడు.. ఇలా చేసిన ప్రతీ సినిమాలోనూ తన మార్క్ చూపించాడు క్రిష్. నవంబర్ 10న ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టి 15 రోజుల్లో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు. కోహినూర్ నేపథ్యంలో సాగే చారిత్రాత్మక కథ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.

krish jagarlamudi,krish jagarlamudi twitter,krish jagarlamudi birthday,happy birthday krish jagarlamudi,pawan kalyan wishes for krish jagarlamudi birthday,krish jagarlamudi vaishnav tej movie 40 days,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,క్రిష్ జాగర్లమూడికి పవన్ బర్త్ డే శుభాకాంక్షలు,క్రిష్‌కు పుష్పగుచ్చం పంపించిన పవన్,క్రిష్ వైష్ణవ్ తేజ్
క్రిష్ పవన్ కళ్యాణ్ (Krish Pawan Kalyan)


దీనికి విరూపాక్ష టైటిల్ పరిశీలిస్తున్నారు కూడా. అయితే కరోనా రావడం.. మధ్యలో అనుకోకుండా బ్రేకులు వేయడంతో క్రిష్ ప్రస్తుతం మరో సినిమాపై ఫోకస్ చేసాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఈయన ఓ చిన్న చిత్రం చేస్తున్నాడు. కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసాడు వికారాబాద్ అడవుల్లో సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు క్రిష్. ఇదిలా ఉంటే తాజాగా క్రిష్ పుట్టిన రోజుకు తన తరఫు నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు పవర్ స్టార్.

krish jagarlamudi,krish jagarlamudi twitter,krish jagarlamudi birthday,happy birthday krish jagarlamudi,pawan kalyan wishes for krish jagarlamudi birthday,krish jagarlamudi vaishnav tej movie 40 days,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,క్రిష్ జాగర్లమూడికి పవన్ బర్త్ డే శుభాకాంక్షలు,క్రిష్‌కు పుష్పగుచ్చం పంపించిన పవన్,క్రిష్ వైష్ణవ్ తేజ్
క్రిష్, పవన్ కళ్యాణ్, రత్నం Photo : Twitter


దర్శకుడు క్రిష్‌కు ఓ పుష్పగుచ్చం కూడా పంపించాడు. నిర్మాత ఏఎం రత్నం ఆఫీసులో క్రిష్ బర్త్ డే వేడుకలు జరిగాయి. కచ్చితంగా పవన్ సినిమాతో క్రిష్ బ్లాక్‌బస్టర్ అందిస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో క్రిష్ కూడా కసిమీదున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Krish, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు