PAWAN KALYAN SENSATIONAL SPEECH IN VAKEEL SAAB MOVIE PRE RELEASE EVENT GOES VIRAL IN SOCIAL MEDIA PK
Pawan Kalyan: ముఖ్యమంత్రి కావాలని లేదు.. అంతకంటే గొప్పది అందుకున్నాను..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
Pawan Kalyan: కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది..
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఈయన ఏ సినిమా ఫంక్షన్కు వచ్చినా కూడా చాలా ఆచితూచి మాట్లాడుతుంటాడు. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు సంచలనంగా మారాయి. నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారు.. మీరు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.. పైరవీలు చేసుకోవచ్చు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని వాళ్లకు సమాధానం చెప్తున్నాను అంటూ ఫైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. తాను అవినీతి చేయకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. దాంతో పాటు కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది.. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. అన్నీ బాగుండి అది కూడా వస్తే అప్పుడు చూద్దాం అంటూ తెలిపాడు పవన్ కళ్యాణ్.
తనకు ముఖ్యమంత్రి పీఠంపై మోజు లేదని.. అలాంటి పదవీ కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదని కుండబద్దలు కొట్టాడు పవర్ స్టార్. మీ అభిమానంతో పోలిస్తే ముఖ్యమంత్రి పీఠం కూడా తనకు చిన్నగా కనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. సినిమా వేడుకలోనే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించాడు జనసేనాని. తనపై నోరు పారేసుకునే ప్రత్యర్థి రాజకీయ పార్టీలను కూడా ఒక ఆట ఆడుకున్నాడు. మర్యాదగా బతికే వాణ్ని గెలికితే దాని పొగరు అంటారు.. అంతేకానీ తనలా తల దించుకొని వెళ్లిపోయే వాడిని పొగరు అంటే ఎవరూ ఏమీ చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. ఇలా ప్రీ రిలీజ్ వేడుక మొత్తం పవన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా కనిపించాడు. ఈ సినిమా ఖచ్చితంగా మీ గుండెలోతుల్లో చోటు సంపాదించుకుంటుంది అని ధీమాగా చెప్పారు పవన్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.