హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: ఇండస్ట్రీ ఏ ఒక్కడి సొత్తు కాదు.. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

Pawan Kalyan: ఇండస్ట్రీ ఏ ఒక్కడి సొత్తు కాదు.. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ఇండస్ట్రీ అందరిదీ అన్నారు పవన్ కళ్యాణ్.కళకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. ఎవరి సినిమా అయినా బావుండాలని కోరుకుంటామన్నారు పవర్ స్టార్.

  నాని(Nani) తాజాగా నటించిన అంటే సుందారినికి సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని  అంటే తనకు కూడా చాలా ఇష్టం గౌరవం అన్నారు. హీరో నానికి తమ ఇంట్లో కూడా అభిమానులు ఉన్నారన్నారు. తన చెల్లి ఓరోజ హడావుడిగా బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి అని తాను అడిగానని.. అప్పుడు వాళ్లు నాని సినిమాకు వెళ్తున్నామని చెప్పారన్నారు.

  టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు పవన్ కళ్యాణ్. ఇది అందరిదీ అన్నారు. ఇక్కడ అనేక రకాల వ్యక్తులు కలిసి పనిచేస్తారన్నారు. టాలీవుడ్ ఓ కుటుంబానిది కాదన్నారు. ఎవరి సినిమా అయినా బావుండాలని కోరకుంటామన్నారు. అంతే తప్పా పోవాలని కోరుకోమన్నారు. మా సినిమా ఎక్కువ బాగుండాలని కోరకుంటామన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరన్నారు. తనకు ఆ స్పష్టత ఉందన్నారు.కళకు కులం,మతం, ప్రాంతీయం ఉండదన్నారు. ప్రజల కోసం ఎలాంటి పనినైనా , ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే గుండె ధైర్యం అభిమానులే ఇచ్చారన్నారు.

  అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమా నిర్మాతలతో కలిసి త్వరలోనే సినిమా చేస్తున్నామన్నారు. నిర్మాతలతో కలిసి హరీశ్ శంకర్ డైరెక్టర్ గా భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) చేయబోతున్నామని తెలిపారు. ఇక తన ఏవీ వద్దన్న వేశారన్నారు. తనకు నాని టీం మీద కోపం వచ్చిందన్నారు. నా ఏవీ చూస్తుంటే నాకే భయం వేసిందన్నారు పవన్ కళ్యాణ్. చూడలేకపోయానని చెమటలు కూడా పట్టాయన్నారు. నా ఏవీ చూసి నేనే షాక్ అయ్యానన్నారు పవర్ స్టార్. అభిమానులకు భయపడి సినిమాల్లో డాన్స్ చేస్తున్నానని.. తనకు డాన్స్ అంటే ఇష్టం లేదన్నారు.

  నిర్మాతలు తనకు గన్ పాయింట్లో పెట్టి డాన్సులు వేయించారన్నారు. వెనుక మ్యూజిక్ ప్లే చేస్తుంటే డాన్స్ వేయడమే తనకు ఇష్టమన్నారు. దయ చేసి తనకు నడిచే అవకాశం ఇవ్వాలని.. డాన్స్ వద్దని అభిమానుల్ని ఈ సందర్భంగా కోరారు పవర్ స్టార్. నానితో పాటు.. అంటే సుందరానికి పనిచేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌‌కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ నివేదిత థామస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Ante sundaraniki, Bhavadeeyudu Bhagat Singh, Natural star nani, Pawan kalyan

  ఉత్తమ కథలు