Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నాను.. సర్కారు వారి పాట విలన్ సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సముద్రఖని ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ .. రామ్ చరణ్ బాబాయి పాత్రలో అలరించిన సముద్రఖని.. తాజాగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కమ్ రాజకీయ నాయకుడు రాజేంద్ర నాథ్ పాత్రలో మహేష్ బాబుతో ఢీ అంటూ ఢీ అనే విలన్ పాత్రలో ఇరగదీసాడు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ తో తాను హీరోగా నటించగా తమిళంలో హిట్టైన ‘వినోదయ సిత్రం’ సినిమాను రీమేక్ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానం ఉంది. ఒక ఫ్యాన్‌గా ఆయన్ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయంలో తనకు క్లారిటీ ఉందన్నారు.
సముద్రఖని వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేస్తున్నట్టు కన్ఫామ్ అయింది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసారు. అంతేకాదు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు కూడా రాస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్లో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.తెలుగులో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో త్రివిక్రమ్ పర్యవేక్షణలో సముద్రఖని ఈ రీమేక్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
Allu Bobby : అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఈ చిత్రంలో తంబి రామయ్య హఠాత్తుగా కనుమూస్తాడు. ఆ తర్వాత పరలోకంలో అడుగుపెడతాడు. అక్కడ తంబి రామయ్య మరణించిన తర్వాత ఇహ లోక బంధాలను తెంచుకోలేక సతమతమవుతూ ఉంటాడు. దేవుడు అతని కోరికను తెలుసుకుంటాడు. మూడు నెలల బ్రతికిస్తే తన బాధ్యతలు పూర్తి చేసుకొని వస్తానని చెబుతారు. ఈ క్రమంలో చనిపోయన వ్యక్తి తిరిగి భూమిపైకి వస్తాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే సంఘటనల నేపథ్యమే ఈ మూవీ. ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో దేవుడి పాత్రలో పవన్ కళ్యాన్, చనిపోయిన తంబి రామయ్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించన్నారు. త్వరలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళ్లనుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కంటే ముందే ఒక షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమాకు ఓకే చెప్పారు. అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తమిళంలో హిట్టైన ‘విక్రమ్ వేద’కు రీమేక్ అని చెబుతున్నారు. ఇందులో మరో హీరోగా రవితేజ నటించే అవకాశాలున్నాయి. తాజాగా సముద్రఖని తో చేయబోయే ’వినోధాయ సిత్రం’ రీమేక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Samuthirakani, Tollywood