Home /News /movies /

PAWAN KALYAN SAI DHARAM TEJ VINODAYA SITTAM SHOOTING UPDATE SLB

Pawan Kalyan: డేట్, టైమ్ ఫిక్స్ చేసిన మామా అల్లుళ్ళు! గెట్ రెడీ మెగా ఫ్యాన్స్..

Photo Twitter

Photo Twitter

Vinodaya sittam Telugu Remake: రీ- ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన పవన్ కళ్యాణ్.. వినోదయ సీతం తెలుగు రీమేక్ సినిమా కోసం కొన్ని డేట్స్ ఇచ్చారని లేటెస్ట్ టాక్. పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఆ డేట్స్ వాడేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఇంకా చదవండి ...
తమిళ సూపర్‌ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ (Vinodaya sittam) సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సోషియో ఫాంటసీ కథాంశంతో సముద్రఖని దర్శకత్వంలో తమిళ భాషలో రూపొంది ZEE5లో స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా అదే సముద్రఖని (Samudrakhani) దర్శకత్వంలో రూపొందించనున్నారట. రీ- ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ఇచ్చారని లేటెస్ట్ టాక్. పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఆ డేట్స్ వాడేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఈ సినిమా కోసం ప‌వ‌న్ కళ్యాణ్ కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే కేటాయించారని జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాకున్నా న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించి మరో అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని జులై 12 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. చకచకా ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇకపోతే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మను (Kethika Sharma) కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీతో సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్. తమిళంలో సముద్రఖని చేసిన పాత్రను పవన్ కళ్యాణ్.. తంబిరామయ్య చేసిన పాత్రను సాయిధరమ్ తేజ్ చేయబోతున్నారట. ముందుగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేసి ఆ తర్వాత సాయి తేజ్‌ని సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేశారట.

ఇటీవలే 'భీమ్లా నాయక్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో కలిసి తెరపంచుకున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్.. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేసింది.
Published by:Sunil Boddula
First published:

Tags: Pawan kalyan, Sai Dharam Tej, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు