హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ క్రేజీ రీమేక్‌కు ముహూర్తం ఖరారు.. ?

Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ క్రేజీ రీమేక్‌కు ముహూర్తం ఖరారు.. ?

Pawan Kalyan : అరువు కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో ఈ జనరేషన్‌లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. తాజాగా ఈయన మరో సినిమాకు ఓకే చెప్పడమే కాదు.. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

Pawan Kalyan : అరువు కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో ఈ జనరేషన్‌లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. తాజాగా ఈయన మరో సినిమాకు ఓకే చెప్పడమే కాదు.. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

Pawan Kalyan : అరువు కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో ఈ జనరేషన్‌లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. తాజాగా ఈయన మరో సినిమాకు ఓకే చెప్పడమే కాదు.. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

  Pawan Kalyan : అరువు కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో ఈ జనరేషన్‌లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా..  గతేడాది పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్‌సాబ్’ మూవీ కూడా హిందీలో హిట్టైన ‘పింక్’ మూవీకి రీమేక్. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ కొన్ని కమర్షియల్ అంశాలు జోడించి చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సాగర్ చంద్ర దర్శకత్వంలో చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా  మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో దాదాపు రూ. 90 కోట్ల షేర్‌తో పాటు రూ. 146 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

  ఒరిజినల్ వెర్షన్‌లో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యతతో తెరకెక్కించారు. కానీ తెలుగులో పనవ్ కళ్యాణ్ క్యారెక్టర్.. రానా క్యారెక్టర్ డేనియల్ శేఖర్ కంటే  ఓ మెట్టు పైనే ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా హిందీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా పవన్ కళ్యాణ్ మరో రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయా సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక భాషలో ప్రూవ్ అయిన కథ కాబట్టి  రిస్క్ తక్కువ. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది వేరే భాషలో ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే తమ భాషలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.

  Tollywood 1st Week Highest share Movies : టాలీవుడ్ ఫస్ట్ వీక్ హైయ్యెస్ట్ షేర్ మూవీస్.. ’భీమ్లా నాయక్’ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..


  ఈ రీమేక్‌లు ఎక్కువ మటుకు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళంలో హిట్టైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ‘వినోధాయ సిత్తం’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  ఇప్పటికే త్రివిక్రమ్ ఈ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసారు. అంతేకాదు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు కూడా రాస్తున్నారు.  ఇందులో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.

  ‘భీమ్లా నాయక్’ మూవీ సెట్‌లో త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్, దర్శకుడు సాగర్ చంద్ర (Twitter/Photo)

  తెలుగులో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్  బ్యానర్‌లో త్రివిక్రమ్ పర్యవేక్షణలో సముద్రఖని ఈ రీమేక్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో తంబి రామయ్య హఠాత్తుగా కనుమూస్తాడు. ఆ తర్వాత పరలోకంలో అడుగుపెడతాడు. అక్కడ తంబి రామయ్య మరణించిన తర్వాత ఇహ లోక బంధాలను తెంచుకోలేక సతమతమవుతూ ఉంటాడు. దేవుడు అతని కోరికను తెలుసుకుంటాడు. మూడు నెలల బ్రతికిస్తే తన బాధ్యతలు పూర్తి చేసుకొని వస్తానని చెబుతారు. ఈ క్రమంలో చనిపోయన వ్యక్తి తిరిగి భూమిపైకి వస్తాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే సంఘటనల నేపథ్యమే ఈ మూవీ. ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో దేవుడి పాత్రలో పవన్ కళ్యాన్, చనిపోయిన తంబి రామయ్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం  కానుంది.

  Bheemla Nayak 1st Week WW Collections : పవన్ కళ్యాణ్ ’భీమ్లా నాయక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

  మరోవైపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవధీయుడు భగత్‌ సింగ్’ సినిమాకు ఓకే చెప్పారు. అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తమిళంలో హిట్టైన ‘విక్రమ్ వేద’కు రీమేక్ అని చెబుతున్నారు. ఇందులో మరో హీరోగా రవితేజ నటించే అవకాశాలున్నాయి.

  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Sai Dharam Tej, Tollywood

  ఉత్తమ కథలు