Pawan Kalyan: ఆ దెబ్బకు మా అన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది... పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan | మొన్నటి వర్షాలకు హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. గత 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో హైదరాబాద్‌‌ను వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. వరదల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇచ్చే విరాళాలపై స్పందించారు.

 • Share this:
  Pawan Kalyan | మొన్నటి వర్షాలకు హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. గత 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో హైదరాబాద్‌‌ను వరదలు ముంచెత్తాయి. అక్కడ వర్ష భీభత్సానికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వరదల్లో చిక్కుకుని కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తమవంతు సాయం చేస్తుంది. ఇప్పుడు వాళ్లకు అండగా నిలబడటానికి టాలీవుడ్ కూడా కదిలింది. ఒక్కొక్కరుగా తమకు తోచిన విరాళం అందించారు. ఐతే.. నటీనటులు ఇచ్చే విరాళాలపై కొందరు మాత్రం ఇవి ఏ మూలకు సరిపోవు. సినీ నటులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.

  పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


  టాలీవుడ్ స్టార్స్ ఇచ్చే విరాళాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారు తమ జేబులోంచి పది రూపాయలైన సాయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏమైనా తీవ్ర పరిస్థితులు ఏర్పడినపుడు అందరి దృష్టి ఎక్కువగా సినిమా నటీనటులపై ఉంటుందన్నారు. ఇక అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సరిగ్గా నడవకపోతే.. నిర్మాతలు రోడ్డు మీదకు వచ్చే దారుణమైన పరిస్థితులున్నాయి. అప్పట్లో నాగయ్య, కాంతారావు సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. అంతేకాదు మా అన్నయ్య నాగబాబు కూడా నిర్మాతగా ‘ఆరెంజ్’ సినిమా నిర్మించనపుడు ఎంతో నష్టపోయాడు.

  పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


  అదే సమయంలో ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో మా కుటుంబ సభ్యుల అండగా నిలిచాము. దీంతో ఆయన కోలుకున్నారు. మా అన్నయ్యలాగా అందరికీ అండగా నిలిచే వాళ్లు అందరికీ ఉండరు కదా అన్నారు. సినిమా వాళ్లు రూ. కోటి సంపాదిస్తే.. జీఎస్‌టీ అంటూ దాదాపు 40 శాతం టాక్సులకే చెల్లించాల్సి ఉంటుంది. సినిమా అనేది బయట నుంచే చూసేవాళ్లకు అందాల అద్దాల మేడ. బయట నుంచి ఎవరైనా రాయి వేస్తే.. ఆ అద్దాల మేడకు పగ్గులు ఏర్పడుతాయన్నారు. బయట నుంచి చూసేందుకు బాగానే ఉంటుంది. లోపల ఉన్న వాళ్లకు తెలుస్తోంది అసలు విషయం.

  పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


  మన దేశంలో సినీ నటుల కంటే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుందన్నారు.  అందుకే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచేందకు వేలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాంటి వాళ్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిస్తే.. బాగుంటుందన్నారు. అదే సమయంలో కరోనా సంక్షోభ సమయంలో హీరో అక్షయ్ కుమార్.. రూ. 25 కోట్ల వరకు సహాయం అందిచారు. నేను రూ. కోటి రూపాయలు ఇచ్చాను. ఆయన స్టేటస్ వేరు. నా స్థాయి వేరు. ఎవరి పరిధిలో వాళ్లు తమ వంతుగా సాయం చేసారు. అయితే.. ఈ విషయంలో మీరెందుకు సహాయం చేయలేదని అని అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు పవన్ కళ్యాణ్.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: