Vakeel Saab: షాకింగ్.. వకీల్ సాబ్ సినిమాకు పవన్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా!

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వర్కింగ్ స్టిల్స్ (Twitter/Photo)

నైజంలో సినిమాకు ఏ అడ్డంకులు లేకపోయినప్పటికి ఏపి లో వకీల్ సాబ్ కు కష్టాలు తప్పలేదు. ఏపీలో బెనిఫిట్ షో లు రద్దయ్యాయి.

  • Share this:


    దాదాపు మూడేళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య రీలిజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలక్షన్స్ కూడా రాబట్టింది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులు భారీగానే థియేటర్ బాట పట్టారు. దీంతో సినిమా భారీగానే వసూళ్ళు రాబట్టింది. నైజంలో సినిమాకు ఏ అడ్డంకులు లేకపోయినప్పటికి ఏపి లో వకీల్ సాబ్ కు కష్టాలు తప్పలేదు. ఏపీలో బెనిఫిట్ షో లు రద్దయ్యాయి. సినిమా రీలిజ్ సమయంలోనే టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో ను కూడా తెచ్చింది. దీంతో సీడెడ్,గంటూర్,కృష్ణాలో వకీల్ సాబ్ సినిమాకు అంతగా కలెక్షన్స్ రాలేదు. దీంతో దిల్ రాజ్,పవన్ కళ్యాణ్ ఇది రాజకీయ కక్షగానే భావించి సరిపెట్టుకున్నారు. ఈ సమయంలోనే పలువురు ఏపీ మంత్రులు పవన్‌పై విమర్శలు చేశారు. హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా అంత పెద్ద బడ్డెట్ పెట్టాల్సిన అవసరం ఉండదని.. దీంతో సినిమాకు నష్టాలు ఉండవని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ సినిమాకు పవన్ 50 కోట్లు తీసుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు.

    ఇక అప్పటినుంచి పవన్ ఆ సినిమాకు ఎంత తీసుకున్నాడో అనే దానిపై తీవ్ర చర్చ జరగుతోంది. అయితే ఈ సినిమా నిజంగా పవన్ కళ్యాణ్ కు యాభై కోట్లు తీసుకున్నారు ఆ సినిమా క్రూ నుంచి వినిపిస్తున్న టాక్. అంతేకాకుండా ఓ ఏరియా రైట్స్ లో షేర్ కింద 15 కోట్లను కూడా పవన్ తీసుకున్నారంటా.. మెుత్తంగా 65 కోట్ల వరకు పవన్ ముట్టాయని తెలుస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published: