కెరీర్ మొదట్లో ఎక్కువ మటుకు రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మధ్యలో కొన్ని స్ట్రెయిట్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినా..అరువు కథలపై ఉన్న అభిమానాన్ని మాత్రం ఒదులుకోలేదు. నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను సెట్స్ చేస్తా అన్న పవన్ కళ్యాణ్...ఆయన ఫిల్మ్ కెరీర్లో ఎక్కవ మటుకు సొంత కథల కంటే అప్పుతెచ్చుకున్న స్టోరీలతోనే ట్రెండ్ సెట్ చేసాడు.తాజాగా అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘లాయర్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్‌ల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ స్టోరి కూడా హిందీలో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’ మూవీని దర్శకుడు ఇవివి సత్యనారాయణ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
ఇప్పటివరకు పవన్ ఇరవై ఐదు సినిమాల్లో యాక్ట్ చేస్తే... అందుల 9 నుంచి 10 సిన్మాలు పక్క భాషల నుంచి అప్పు తెచ్చుకున్న స్టోరీలే కావడం విశేషం. ఇక రెండో సినిమా ‘గోకులంలో సీత’ విషయానికొస్తే ఈ మూవీ తమిళంలో కార్తిక్ హీరోగా యాక్ట్ చేసిన ‘‘గోకులతిల్ సీతై’’ కు రీమేక్. ఆ తర్వాత చేసిన ‘సుస్వాగతం’ కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ‘‘లవ్ టుడే’’ కు జిరాక్స్ కాపీనే. ఈ రెండు సిన్మాలు పవన్ ఫిల్మీ కెరీర్‌కు బాగానే ఉపయోగపడ్డాయి.
‘తమ్ముడు’ మూవీ విషయానికొస్తే ఈ సినిమా హిందీలో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ‘‘జో జీతా వహీ సికందర్’’ కు రీమేక్. హిందీల అమీర్ ఖాన్...సైకిల్ పోటీలో పాల్గొంటే..తెలుగులో మాత్రం బాక్సింగ్ కాన్సెప్ట్ మీద తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
‘తమ్ముడు’ సిన్మా తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేసిన ‘ఖుషీ’ మూవీ తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ‘ఖుషీ’కీ టైటిల్‌తో సహా అన్ని కాపీ పేస్ట్ అనే చెప్పాలె. ఈ మూవీతో హీరోగా పవన్ కళ్యాణ్... స్టార్ డమ్ పీక్స్‌కు చేరింది.
‘ఖుషీ’ తర్వాత చేసిన చాలా ఏళ్లకు చేసిన ‘అన్నవరం’ చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ‘‘తిరుపాచి’’ మూవీకి రీమేకే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. .ఆ తర్వాత పపన్ జయంత్ డైరెక్షన్ల చేపిన ‘తీన్మార్’...హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన ‘‘లవ్ ఆజ్ కల్’’ కు రీమేకే. పేరు తగ్గట్టు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దరువేయలేకపోయింది.
ఇక పవన్ యాక్ట్ చేసిన రీమేక్ సిన్మాలను ఓ సారి చూస్తే...కథ మాత్రమే తీసుకుని...ఆ స్టోరిలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి హిట్లు అందుకున్నాడు. అందుకు ఉదాహరణ హిందీలో సూపర్ హిట్టైనా ‘‘దబాంగ్’’ మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్లో మన ఆఢియన్స్కు నచ్చేటట్టు కొన్ని మార్పులు చేసి అందులో అంత్యాక్షరి ఎపిసోడ్ పెట్టి తెలుగులో పవన్ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్‌తో కెవ్వుకేక పుట్టించింది.
ఆ తర్వాత వెంకటేశ్‌తో చేసిన మల్టీస్టారర్ ‘‘గోపాల గోపాల’’ కూడా హిందీలో హిట్టైనా ‘ఓ మై గాడ్’ కు తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిన విషయమే కదా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
ఇక ‘అజ్ఞాతవాసి’ కంటే ముందు చేసిన ‘కాటమరాయుడు’ మూవీ కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘‘వీరం’’ సినిమాకు రీమేక్. ఈ మూవీ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘పింక్’ సినిమాను తెలుగులో ‘లాయర్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు ఇందులో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఏమైనా పక్కభాషలో హిట్టైన సినిమాలను ఇక్కడి ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించడం అంతా ఈజీకాదు. ఎటోచ్చి సినిమా ఇండస్ట్రీల నెగ్గుకురావాలంటే సక్సెస్ కంపల్సరీ. అందుకు రీమేక్ సినిమాలు నమ్ముకోవడం తప్పు కాదంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Pawan kalyan, Pink, Telugu Cinema, Tollywood