పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడా ..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న ఇంకా సినిమా ఇండస్ట్రీని మాత్రం ఒదలడం లేదు.

news18-telugu
Updated: September 6, 2019, 2:41 PM IST
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడా ..
జనసేన అధినేత పవన్ కల్యాణ్
  • Share this:
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ  మొన్నటి ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. వారు ముందు నుంచి కోరుకుంటున్న మార్పుకు సంబంధించి రాష్ట్రంలో వారు ఇంకొన్నాళ్ళు బలమైన పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యేలా లేదని జనసేన శ్రేణులు సహా పవన్ కూడా అనుకున్నారు. ఎన్నికల తర్వాత పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటారంటూ జోరుగా ప్రచారం జరిగాగినా పవన్ సినిమాలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ ‘జనసేన’ పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్ ఇపుడు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే పవన్ మాత్రం తనకు గుర్తింపును తీసుకొచ్చిన చిత్ర పరిశ్రమను మాత్రం మరువడంలేదు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పరొక్షంగా సినీపరిశ్రమకు చేతనైన సేవచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవల తన అన్న చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' కి వాయిస్ ఓవర్ ఇచ్చి తనవొంతు సాయంచేసిన పవన్ సినీ కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చే చిత్రపురి కాలనీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు. జనసేన కార్యాలయంలో కలిసిన జూనియర్ ఆర్టిస్టులు, క్యాస్టూమర్లు, ఫైటర్లతో పవన్ కల్యాణ్ చిత్రపురి కాలనీ సమస్యలపై చర్చించారు. చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కకుండా వేదనకు లోనవుతున్న వారికి భరోసాగా ఉంటానంటూ చిత్రపురి కాలనీ సమస్యలపై ఎన్ శంకర్, పరుచూరి వెంకటేశ్వర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజాతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా పవన్ నటుడిగా సినిమా పరిశ్రమకు దూమరమైనా.. పరోక్షముగా సినీ పరిశ్రమతోనే తన అనుబంధాన్ని కొనసాగించడం విశేషం.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు