హోమ్ /వార్తలు /సినిమా /

Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్

Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్

Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer (News 18 Photo)

Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer (News 18 Photo)

Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ పూర్తి చేసుకునం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు "నేను మీకు బాగా కావాల్సినవాడిని" (Nenu Meeku Baaga Kavalsinavaadini) చిత్రం రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ పూర్తి చేసుకునం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer) రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతుల మీదుగా వదిలారు. ప్రస్తుతం ఈ "నేను మీకు బాగా కావాల్సినవాడిని" ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.


ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోలో హీరో కిరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది.


ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను ఈ నెల 16న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ కిరణ్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Pawan kalyan, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు