హోమ్ /వార్తలు /సినిమా /

Kiran Abbavaram | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా.. నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని ట్రైలర్ విడుదల..

Kiran Abbavaram | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా.. నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని ట్రైలర్ విడుదల..

Pawan Kalyan released Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer Photo : Twitter

Pawan Kalyan released Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer Photo : Twitter

Kiran Abbavaram : రాజావారు రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు కిరణ్ అబ్బ‌వ‌రం. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ చిత్రం నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని. ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని (Nenu Meeku Baaga Kavalsinavaadini ).S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అది అలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. మాస్ అంశాలతో ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer)  ఆకట్టుకుంటోంది. డైలాగ్స్, మాస్ సీన్స్‌తో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ట్రైలర్ విషయానికి వస్తే... 'కాస్ట్యూమ్స్ .. కళ్లజోడు చూస్తే అర్థం కావడం లేదూ .. మనం ఊరమాస్' అంటూ తన కేరక్టర్ గురించి కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే హీరో ఈ సినిమాలో కిరణ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది. ఇక కథ విషయానికి వస్తే.. ప్రేమ .. పెళ్లి .. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు ఎస్ వి కృష్ణా రెడ్డి చాలా రోజులకు కనిపించి అదరగొట్టారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. ట్రైలర్ గురించి మరో విశేషం ఏమంటే.. మణిశర్మ (Manisharma) ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. మంచి నిర్మాణ విలువలతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. చూడాలి మరి సినిమా ఏమాత్రం ఆకట్టుకోనుందో..


    ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. అంతేకాదు వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన "నచ్చావ్ అబ్బాయి" పాటకు అద్భుతమైన రెస్పాన్స్ "నచ్చావ్ అబ్బాయి" పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.





    ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు నటిస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Kiran abbavaram, Pawan kalyan, Tollywood news

    ఉత్తమ కథలు