పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ షూటింగ్లో బిజీ అయ్యారు. కరోనాతో దాదాపు ఎనిమిది నెలలకు పైగానే ఇంట్లో ఉన్న పవన్.. తాజాగా వకీల్ సాబ్ షూటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. అందులో పవన్ జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లో పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసా. దానికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వకీల్ సాబ్ షూటింగ్ గ్యాప్‌లో పవన్ కల్యాణ్ బుక్ చదువుతూ కనిపించారు. సాధారణంగానే బుక్‌లు బాగా చదివే అలవాటున్న పవన్.. ఇప్పుడు షూటింగ్ గ్యాప్‌లో అదే చేస్తున్నారు. ఇక ఈ ఫొటో పవన్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుడగా.. మా హీరో వేరంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

పవన్ కల్యాణ్
కాగా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన శ్రుతీ హాసన్ మూడోసారి జత కడుతున్నారు. అంజలి, నివేథా థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ లాయర్‌గా కనిపించనుండగా.. ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.