ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళంలో హిట్టైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్.. హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కన్ను మరో రీమేక్ పై పడింది. అదే తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ను తెలుగుతో రవితేజతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
2017లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ అవుతుందని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. ముందుగా నాగార్జున, వెంకటేష్ ఈ రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగార్జున, రానా అంటూ ఆపై వెంకటేష్, రానా, బాలకృష్ణ, రాజశేఖర్ ఈ రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్గా వరుణ్ తేజ్, రవితేజ కూడా ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేసాయి. తాాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల లోపు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త స్టోరీతో కుస్తీ పట్టడం కంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ అయితే రిస్క్ ఉండదనే ఉద్దేశ్యంతో ఈ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. మరో హీరో మాధవన్ పాత్రలో రవితేజను సంప్రదించారట. మాస్‌రాజా కూడా ఈ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను తెలుగులో బాబీ (కే.యస్.రవీంద్ర) డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. డాలీ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీ చేయిస్తున్నాడట. హరీష్ శంకర్ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Madhavan, Pawan kalyan, Ravi Teja, Tollywood, Vakeel Saab, Vijay Sethupathi