హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak 16 Days Collections : ‘భీమ్లా నాయక్’ 16 డేస్ కలెక్షన్స్.. కలెక్షన్స్ పై ’రాధే శ్యామ్’ ఎఫెక్ట్..

Bheemla Nayak 16 Days Collections : ‘భీమ్లా నాయక్’ 16 డేస్ కలెక్షన్స్.. కలెక్షన్స్ పై ’రాధే శ్యామ్’ ఎఫెక్ట్..

‘భీమ్లా నాయక్’ 16 రోజుల కలెక్షన్స్ (Twitter/Photo)

‘భీమ్లా నాయక్’ 16 రోజుల కలెక్షన్స్ (Twitter/Photo)

Bheemla Nayak 16 Days WW Collections | పవన్ కళ్యాణ్, రానా  హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారంలో అడుగు పెట్టింది. ఇక 16 రోజు భీమ్లా నాయక్ ఏ మేరకు జోరు చూపించిందో చూద్దాం..

ఇంకా చదవండి ...

  Bheemla Nayak 16 Days WW Collections : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ కలెక్షన్స్ మొదటి వారం బాగానే ఉన్నా.. రెండో వారం బాక్సాఫీస్ దగ్గర సరైన రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టడంలో విఫలమైంది. ఏపీలో టిక్కెట్స్ మరి తక్కువగా ఉండటం.. తెలంగాణలో చూస్తే  టికెట్స్ రేట్స్ భారీగా ఉండటం కూడా ఈ సినిమాపై కలెక్షన్స్ పై భారీగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా నైజాంలో ఎక్కువ రేట్స్ కారణంగా  రిపీట్ ఆడియన్స్ రాలేదనే చెప్పాలి. ఫస్ట్ వీక్ మంచి వసూళ్లనురాబట్టిన భీమ్లా నాయక్..  8వ రోజు నుంచి కలెక్షన్స్‌లో పెద్దగ పెరుగుదల లేదు. తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు కాస్త దగ్గరలోకి వచ్చింది. ఓవర్సీస్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన చాలా  ఏరియాల్లో బయ్యర్స్ గట్టెక్కడం కష్టమే అంటున్నారు ఇపుడున్న పరిస్థితులు చూస్తుంటే..   మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరలేదు.

  ఇక మొదటి వారం ‘భీమ్లా నాయక్’ మూవీ.. రూ. 70.40 కోట్లు వసూళు చేసిన ఈ మూవీ... రెండో వారంలో మొత్తంగా రూ. 4.62 కోట్లు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టింది. 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు రూ. 8 లక్షలు వసూలు చేస్తే.. 16వ రోజు రూ. 25 లక్షలు వసూలు చేయడం విశేషం.   సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు నుంచి తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా రూ.  కోట్లకు పైగా దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రాధే శ్యామ్ రావడంతో ఈ సినిమాకు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.

  Radhe Shyam 2nd Day WW Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ స్టార్ ఇమేజ్‌ను ప్రశ్నించేలా వసూళ్లు..

  నైజాం (తెలంగాణ): రూ. 34.76 కోట్లు / రూ. 35.00 కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ. 11.06 కోట్లు / రూ. 17.00 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ. 7.57 కోట్లు /  రూ.  9.50 కోట్లు

  ఈస్ట్: రూ. 5.47 కోట్లు  / రూ. 6.50 కోట్లు

  వెస్ట్: రూ. 4.96కోట్లు /  రూ. 5.60 కోట్లు

  గుంటూరు: రూ. 5.21కోట్లు / రూ. 7.20 కోట్లు

  కృష్ణా:  రూ. 3.78 కోట్లు / రూ. 6.00 కోట్లు

  నెల్లూరు: రూ. 2.54 కోట్లు / రూ . 3.20 కోట్లు

  ఏపీ + తెలంగాణ:  రూ. 75.35 కోట్లు (గ్రాస్ రూ. 115.25 కోట్లు) / రూ. 90.00 కోట్లు

  రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 8.22 కోట్లు /  రూ. 10.50 కోట్లు

  ఓవర్సీస్:రూ. 12.50 కోట్లు / రూ. 9.00 కోట్లు

  వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 96.07 కోట్లు (గ్రాస్ రూ. 156.41 కోట్లు) / రూ. 106.75 కోట్లు.

  Roja - Vijayashanti - Sai Pallavi: ఆ తరంలో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి..

  భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 16 రోజుల్లో దాదాపు 96.07 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో రూ. 11.93 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. వీకెండ్ క్యాష్ చేసుకోవడంలో తడబడింది భీమ్లా నాయక్. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. రాధే శ్యామ్ రాకతో ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు