Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో (Pawan Kalyan) పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండేది. ఆర్ ఆర్ ఆర్ సడెన్‌గా బరిలోకి దిగడంతో ఈ సినిమా ఫిబ్రవరి 25కి మారింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.
ఇక ఫిబ్రవరి 25న విడుదలకు రెడీ అవుతుండడంతో.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయాలనీ చూస్తోంది టీమ్. ఇక ప్రిరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరుగనుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది టీమ్.
EXCLUSIVE: #BheemlaNaayak post-theatrical streaming rights acquired by Disney+ Hotstar for a record price. pic.twitter.com/mEqcDTEmnD
— LetsOTT Global (@LetsOTT) February 17, 2022
ఇక ఆ మధ్య లాలా భీమ్లా సాంగ్ విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యారు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ ఇమేజ్ ఓ ఐదారు మెట్లు పైనే ఉంటాడు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది. రానా నటిస్తున్నా కూడా దాన్ని మల్టీస్టారర్ అనట్లేదెవ్వరూ. ఎక్కువగా పవన్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా పవన్ పేరు మీదే జరుగుతుంది.
దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)లు నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Raashi Khanna : రాశీ ఖన్నాను ఇలా ఎప్పుడైనా చూశారా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..
ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheemla Nayak, Pawan kalyan