హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak : అక్కడ నాలుగు వందల థియేటర్స్‌లో రిలీజ్ అవుతోన్న భీమ్లా నాయక్..

Bheemla Nayak : అక్కడ నాలుగు వందల థియేటర్స్‌లో రిలీజ్ అవుతోన్న భీమ్లా నాయక్..

కరోనా మూడో దశ తగ్గుతున్న వేళ విడుదలవుతున్న తొలి భారీ సినిమా ఇదే. బంగార్రాజు వచ్చినా.. దాని బిజినెస్ తక్కువే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేస్తుండటం.. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా పవన్ కళ్యాణ్ కోసం తెలుగులో కొన్ని మార్పులు కూడా చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. సాగర్ కే చంద్ర దీనికి దర్శకుడు అయినా కూడా వెనకుండి నడిపించింది మాత్రం మాటల మాంత్రికుడే. అందుకే ఈ చిత్రంపై అన్ని అంచనాలు పెరిగిపోయాయి.

కరోనా మూడో దశ తగ్గుతున్న వేళ విడుదలవుతున్న తొలి భారీ సినిమా ఇదే. బంగార్రాజు వచ్చినా.. దాని బిజినెస్ తక్కువే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేస్తుండటం.. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా పవన్ కళ్యాణ్ కోసం తెలుగులో కొన్ని మార్పులు కూడా చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. సాగర్ కే చంద్ర దీనికి దర్శకుడు అయినా కూడా వెనకుండి నడిపించింది మాత్రం మాటల మాంత్రికుడే. అందుకే ఈ చిత్రంపై అన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

    Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో (Pawan Kalyan) పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండేది. ఆర్ ఆర్ ఆర్ సడెన్‌గా బరిలోకి దిగడంతో ఈ సినిమా ఫిబ్రవరి 25కి మారింది. ఈ సినిమా అవ్వడానికి రీమేక్ అయినా కూడా అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా.. యూఎస్‌లో ఏకంగా 400కి పైగా థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. యూఎస్‌లో బుకింగ్స్ పరంగా ఇప్పటికే లక్ష డాలర్స్ మార్క్‌ను ఈ సినిమా క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది.

    ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.

    ఇక ఫిబ్రవరి 25న విడుదలకు రెడీ అవుతుండడంతో.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయాలనీ చూస్తోంది టీమ్. ఇక ప్రిరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరుగనుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది టీమ్.

    ఇక ఆ మధ్య లాలా భీమ్లా సాంగ్ విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యారు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ ఇమేజ్ ఓ ఐదారు మెట్లు పైనే ఉంటాడు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది. రానా నటిస్తున్నా కూడా దాన్ని మల్టీస్టారర్ అనట్లేదెవ్వరూ. ఎక్కువగా పవన్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా పవన్ పేరు మీదే జరుగుతుంది.

    Alia Bhatt : బాత్ టబ్‌లో పరువాల విందు చేసిన ఆర్ ఆర్ ఆర్ భామ అలియా భట్.. పిక్స్ వైరల్..

    దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటిస్తున్నారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ  సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood news

    ఉత్తమ కథలు