హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak Pre Release Event : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు ఊహించని గెస్ట్..

Bheemla Nayak Pre Release Event : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు ఊహించని గెస్ట్..

Pawan Kalyan - Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుకోని ముఖ్య అతిథి హాజరు కానున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan - Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు.  ఈ సినిమా ఈ నెల 25న ఏక కాలంలో తెలుగుతో పాటు హిందీతో విడుదల కానుంది.  ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అవ్వడానికి రీమేక్ అయినా కూడా అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా.. యూఎస్‌లో ఏకంగా 400కి పైగా థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

  యూఎస్‌లో బుకింగ్స్ పరంగా ఇప్పటికే లక్ష డాలర్స్ మార్క్‌ను ఈ సినిమా క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)  ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ప్రకటించారు. అపుడే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

  ఇక ప్రిరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరుగనుందని అంటున్నారు.
  ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్ (Twitter/Photo)

  ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. తెర వెనక త్రివిక్రమ్ అంతా చక్రం తిప్పారు. ఈ సినిమాకు అనధికార దర్శకుడిగా ఈయన పేరే వినిపిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాసారు.  పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటించారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.

  Mohan Babu : మోహన్ బాబుకు ఘోర అవమానం.. ‘సన్నాఫ్ ఇండియా’తో మంచులా కరిగిపోయిన కలెక్షన్ కింగ్ ఇమేజ్..

  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది.

  Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్‌లో ఈ యాంగిల్‌ను ఎవరు చూసుండరు.. అతనికి బాగా గడ్డి పెట్టిన బ్యూటీ..

  తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యారు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ ఇమేజ్ ఓ ఐదారు మెట్లు పైనే ఉంటాడు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది. రానా నటిస్తున్నా కూడా దాన్ని మల్టీస్టారర్ అనట్లేదెవ్వరూ. ఎక్కువగా పవన్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా పవన్ పేరు మీదే జరుగుతుంది.

  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Tollywood

  ఉత్తమ కథలు