హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan | Bheemla Nayak : ఇరగదీస్తోన్న భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్.. టాప్‌లో ట్రెండింగ్..

Pawan Kalyan | Bheemla Nayak : ఇరగదీస్తోన్న భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్.. టాప్‌లో ట్రెండింగ్..

Pawan Kalyan | Bheemla Nayak :ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్ జరగగా.. రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను వదిలింది టీమ్. ఈ ట్రైలర్‌కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లేటెస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ను పొందింది.

Pawan Kalyan | Bheemla Nayak :ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్ జరగగా.. రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను వదిలింది టీమ్. ఈ ట్రైలర్‌కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లేటెస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ను పొందింది.

Pawan Kalyan | Bheemla Nayak :ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్ జరగగా.. రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను వదిలింది టీమ్. ఈ ట్రైలర్‌కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లేటెస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ను పొందింది.

ఇంకా చదవండి ...

    Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్ జరగగా.. రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను వదిలింది టీమ్. ఈ ట్రైలర్‌కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లేటెస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ను పొందింది. అంతేకాదు ఈ తాజా ట్రైలర్ యూ ట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక మరోవైపు రెండు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో కూడా బుకింగ్స్ ఓ రేంజ్‌లో పుంజుకున్నాయి. యూఎస్‌లో ప్రీమియర్స్ తోనే ఏకంగా 6 లక్షల డాలర్లు ఈ చిత్రం క్రాస్ చేసేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా అవ్వడానికి రీమేక్ అయినా కూడా అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా యూఎస్‌లో ఏకంగా 400కి పైగా థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

    ఇక భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే.. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో (Pawan Kalyan) పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ మంత్రి కేటీఆర్, స్పెషల్ గెస్ట్‌గా తలసాని శ్రీనివాస యాదవ్ హాజరైయ్యారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహా కూడా భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసింది టీమ్. అయితే ఓ వారం తర్వాత అక్కడ విడుదలకానుందని అంటున్నారు.

    ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యారు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ ఇమేజ్ ఓ ఐదారు మెట్లు పైనే ఉంటారు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది.

    Anchor Sreemukhi : ఖతర్నాక్ పోజులతో కవ్విస్తోన్న యాంకర్ శ్రీముఖి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

    దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాశారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటిస్తున్నారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ  సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.

    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood news

    ఉత్తమ కథలు