Bheemla Nayak : అమెజాన్ ప్రైమ్‌లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌.. 150 కోట్ల డీల్‌...

Bheemla Nayak Photo : Twitter

Bheemla Nayak : ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. భీమ్లా నాయక్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఒకవేళా ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసిందని టాక్.

  • Share this:
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak). యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. భీమ్లా నాయక్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఒకవేళా ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసిందని టాక్. అయితే ఇంత పెద్ద ఆఫర్‌ను కూడా చిత్ర దర్శక నిర్మాతలు పక్కకు పెట్టారట. ఈ సినిమాను మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది.

    Anchor Sreemukhi : నిమ్మ పండు రంగు డ్రెస్‌లో పరువాల విందు చేసిన శ్రీముఖి.. వావ్ అనాల్సిందే...

    ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటిల మధ్యన వచ్చే కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

    ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.

    Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా రవితేజ భామ..

    ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. కొంత కాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలో షూట్ రిస్టార్ట్ కానుంది.

    ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
    Published by:Suresh Rachamalla
    First published: