Pawan Kalyan | Rana | Bheemla Nayak : భారీ ధరకు అమ్ముడైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఆడియో రైట్స్..

‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ (Twitter/Photo)

Pawan Kalyan | Rana | Bheemla Nayak : పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్ ఆడియో రైట్స్‌ను భారీ ధరకు ఓ ప్రముఖ ఆడియో కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌ (Bheemla Nayak)లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ టీజర్ విడుదలై అదరగొట్టింది. ఈ టీజర్ ఇటు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కి సిద్దం గా ఉంది. అది అలా ఉంటే ఈ చిత్రం నుంచి మరో వార్త హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంల పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటలు అందిస్తుండగా, సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

    ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో.

    ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.

    ఇక పవన్ నటించిన మరో సూపర్ హిట్ చిత్రం వకీల్ సాబ్.. ఆ మధ్య థియేటర్‌లో విడుదలై అదరగొట్టింది. హిందీ పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ వచ్చింది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు (Venu Sri Ram) దర్శకత్వం వహించాగా.. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ (Shruti Haasan) నటించారు.
    Published by:Suresh Rachamalla
    First published: