Bheemla Nayak 9 days WW collections: భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కానీ తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత దారుణమైన డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరేలా కనిపించడం లేదు. ఆరు రోజుల వరకు వసూళ్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత బాగా పడిపోయాయి. సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు నుంచి తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. రెండో శనివారం సినిమాకు కేవలం కోటిన్నర షేర్ మాత్రమే వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 15 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌కు 9 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 9 రోజుల్లో దాదాపు 92 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 15 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. శివరాత్రి సెలవును క్యాష్ చేసుకోవడంతో 9 కోట్లు షేర్ వచ్చింది. ఇప్పుడు వీకెండ్ క్యాష్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ శనివారం అయితే వసూళ్లు అంతగా రాలేదు. మరి రెండో ఆదివారం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పట్నుంచి వచ్చే కలెక్షన్స్‌ను బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంది. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. భీమ్లా నాయక్ ప్రయాణం ఎంతవరకు ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.