హోమ్ /వార్తలు /movies /

Bheemla Nayak 8 days WW collections: ‘భీమ్లా నాయక్’ 8 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే..?

Bheemla Nayak 8 days WW collections: ‘భీమ్లా నాయక్’ 8 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే..?

Bheemla Nayak 8 days WW collections: అనుకున్నట్లుగానే శివరాత్రి రోజు భీమ్లా నాయక్ (Bheemla Nayak 8 days WW collections) అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు వసూళ్లు పడిపోయినా.. ఐదో రోజు శివరాత్రి సెలవు కావడంతో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది భీమ్లా. కానీ మళ్లీ ఆరో రోజు నుంచి అదే పరిస్థితి.

ఇంకా చదవండి ...

  అనుకున్నట్లుగానే శివరాత్రి రోజు భీమ్లా నాయక్ అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు వసూళ్లు పడిపోయినా.. ఐదో రోజు శివరాత్రి సెలవు కావడంతో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది భీమ్లా. కానీ మళ్లీ ఆరో రోజు నుంచి అదే పరిస్థితి. కేవలం మొదటి ఆరు రోజులు మాత్రమే కోటి కంటే ఎక్కువ షేర్ వసూలు చేసింది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా. ఆ తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ కోటి కంటే తక్కువకు పడిపోయాయి. వకీల్ సాబ్ వరసగా 10 రోజుల పాటు కోటి కంటే ఎక్కువ వసూళ్లు తీసుకొచ్చింది. కానీ భీమ్లా నాయక్ విషయంలో అది జరగడం లేదు. సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు మాత్రం తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 15 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌కు 8 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

  నైజాం: 33.42 కోట్లు

  సీడెడ్: 10.25 కోట్లు

  ఉత్తరాంధ్ర: 7.03 కోట్లు

  ఈస్ట్: 5.09 కోట్లు

  వెస్ట్: 4.68 కోట్లు

  గుంటూరు: 4.87 కోట్లు

  కృష్ణా: 3.44 కోట్లు

  నెల్లూరు: 2.36 కోట్లు

  ఏపీ, తెలంగాణ 8 డేస్ కలెక్షన్స్: 71.14 కోట్లు

  రెస్టాఫ్ ఇండియా  + కర్ణాటక: 7.74 కోట్లు

  ఓవర్సీస్: 11.72 కోట్లు

  వరల్డ్ వైడ్ 8 డేస్ కలెక్షన్స్: 90.60 కోట్లు (147.50 కోట్లు గ్రాస్)

  Adavallu Meeku Joharlu 1st day ww Collections: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్..

   భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 8 రోజుల్లో 90.60 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 16 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. శివరాత్రి సెలవును క్యాష్ చేసుకోవడంతో 9 కోట్లు షేర్ వచ్చింది. ఇప్పుడు వీకెండ్ కూడా క్యాష్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పట్నుంచి వచ్చే కలెక్షన్స్‌ను బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంది. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. భీమ్లా నాయక్ ప్రయాణం ఎంతవరకు ఉండబోతుందో..?

  First published:

  ఉత్తమ కథలు