PAWAN KALYAN RANA DAGGUBATI BHEEMLA NAYAK 4 DAYS WW COLLECTIONS AND HUGE DROP ON 4TH DAY PK
Bheemla Nayak 4 days WW collections: ‘భీమ్లా నాయక్’ 4 డేస్ కలెక్షన్స్.. నాలుగో రోజు భారీగా పడిపోయిన వసూళ్లు..
‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ (Twitter/Photo)
Bheemla Nayak 4 days WW collections: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak collections). త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak collections). త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు మాత్రం తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. కేవలం 5.30 కోట్ల షేర్ మాత్రమే నాలుగో రోజు వసూలు చేసింది భీమ్లా నాయక్. శివరాత్రి హాలీడే కావడంతో 5వ రోజు కచ్చితంగా మళ్లీ కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు బయ్యర్లు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 32 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌కు 4 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 4 రోజుల్లో 75 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 32 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. శివరాత్రి సెలవును క్యాష్ చేసుకోవడమే కాకుండా రెండో వీకెండ్ కూడా పర్ఫార్మ్ చేస్తేనే సినిమా సేఫ్ అవుతుంది. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. భీమ్లా నాయక్ ప్రయాణం ఎంతవరకు ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.