Home /News /movies /

PAWAN KALYAN RANA DAGGUBATI BHEEMLA NAYAK 1ST DAY WW COLLECTIONS AND HUGE EFFECT ON AP COLLECTIONS PK

Bheemla Nayak 1st Day WW collections: ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏపీలో భారీ దెబ్బ..

భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ (Bheemla Nayak)

భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ (Bheemla Nayak)

Bheemla Nayak 1st Day WW collections: ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన భారీ సినిమా కావడం.. అందులోనూ పవన్ హీరో కావడంతో బాక్సాఫీస్ మోతెక్కిపోతుంది.

ఇంకా చదవండి ...
ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన భారీ సినిమా కావడం.. అందులోనూ పవన్ హీరో కావడంతో బాక్సాఫీస్ మోతెక్కిపోతుంది. కరోనా (Corona Cases) కేసులు కూడా మెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో రప్ఫాడిస్తున్నాడు పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్‌లోనూ (Overseas) దుమ్ము దులిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దానికితోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అస్సలు తగ్గడం లేదు భీమ్లా నాయక్. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఏపీలో మాత్రం చాలా చోట్ల షోలు ఆగిపోవడం.. టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు పవన్ సినిమాలకు వచ్చే వసూళ్ళు ఇప్పుడు రాలేదు. వకీల్ సాబ్ (Vakeel Saab) కలెక్షన్స్‌ను కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం. మరి ఏపీ, తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

నైజాం: 11.85 కోట్లు
సీడెడ్: 3.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.88 కోట్లు
ఈస్ట్: 1.95 కోట్లు
వెస్ట్: 3.02 కోట్లు (2Cr Hires)
గుంటూరు: 2.51 కోట్లు (1.45Cr Hires)
కృష్ణా: 0.89 కోట్లు
నెల్లూరు: 1.04 కోట్లు (24L hires)

AP-TG టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్: 26.42 కోట్లు (38 కోట్లు గ్రాస్)(3.69 కోట్లు హైర్స్)
ఓవర్సీస్: 6.85 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.10 కోట్లు
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 36.37 కోట్లు షేర్

Venkatesh - Rana Daggubati: దగ్గుబాటి 3 జనరేషన్స్‌కు ఫిబ్రవరి 25 మోస్ట్ స్పెషల్.. ఎందుకో తెలుసా..?


తెలంగాణలో 36 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. తొలిరోజే 11.85 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ ఏపీలో మాత్రం కేవలం 14 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. పవన్ రేంజ్‌కు ఇది తక్కువే. కానీ అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. టికెట్ రేట్లకు తోడు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయక్కడ. అవన్నీ ఈ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించాయి. అన్నిచోట్లా హౌజ్ ఫుల్స్ ఉన్నా టికెట్ రేట్స్ తక్కువగా ఉండటమే అసలు శాపంగా మారిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bheemla Nayak, Box Office Collections, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు