హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak 13 Days WW Collections : ‘భీమ్లా నాయక్’ 13 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌కు ఎదురీతున్న పవన్ కళ్యాణ్..

Bheemla Nayak 13 Days WW Collections : ‘భీమ్లా నాయక్’ 13 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌కు ఎదురీతున్న పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్, రానాల  భీమ్లా నాయక్  (Bheemla Nayak)

పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ (Bheemla Nayak)

Bheemla Nayak 13 Days WW Collections :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  మొత్తంగా 13 రోజు కూడా భీమ్ల నాయక్ బాక్సాపీస్‌కు ఎదురీదుతోంది. మొత్తంగా 13 రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...

    Bheemla Nayak 13 Days WW Collections : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ కలెక్షన్స్ మొదటి వారం అది కూడా శివరాత్రి వరకు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపింది. ఆ తర్వాత తెలంగాణలో టికెట్స్ రేట్స్ భారీగా ఉండటంతో రిపీట్ ఆడియన్స్ రాలేదనే చెప్పాలి. 8వ రోజు నుంచి ‘భీమ్లా నాయక్’ మూవీ కలెక్షన్స్‌లో పెద్దగ పెరుగుదల లేదు. తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు కాస్త దగ్గరలోకి వచ్చింది. ఓవర్సీస్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన చాలా  ఏరియాల్లో నష్టాలు కూడా తప్పేలా కనిపించడం లేదు. మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరలేదు.

    రెండో శనివారం, ఆదివారం కలిపి కేవలం రూ.  4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆరు రోజుల వరకు వసూళ్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత బాగా పడిపోయాయి. సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు నుంచి తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 12.42 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌కు 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ., 20 లక్షల షేర్ వచ్చింది.  ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

    నైజాం (తెలంగాణ): రూ. 34.60 కోట్లు / రూ. 35.00 కోట్లు

    సీడెడ్ (రాయలసీమ): రూ. 10.98 కోట్లు / రూ. 17.00 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ. 7.51 కోట్లు /  రూ.  9.50 కోట్లు

    ఈస్ట్: రూ. 5.43 కోట్లు  / రూ. 6.50 కోట్లు

    వెస్ట్: రూ. 4.94కోట్లు /  రూ. 5.60 కోట్లు

    గుంటూరు: రూ. 5.18కోట్లు / రూ. 7.20 కోట్లు

    కృష్ణా:  రూ. 3.75 కోట్లు / రూ. 6.00 కోట్లు

    నెల్లూరు: రూ. 2.53 కోట్లు / రూ . 3.20 కోట్లు

    ఏపీ + తెలంగాణ:  రూ. 74.92 కోట్లు (గ్రాస్ రూ. 114.42 కోట్లు) / రూ. 90.00 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 8.20 కోట్లు /  రూ. 10.50 కోట్లు

    ఓవర్సీస్:రూ. 12.46 కోట్లు / రూ. 9.00 కోట్లు

    వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 95.58 కోట్లు (గ్రాస్ రూ. 146 కోట్లు) / రూ. 106.75 కోట్లు.

    Top Tollywood Movies Pre Release Business : ‘బాహుబలి’ టూ ’రాధే శ్యామ్’ వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..

    భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 13 రోజుల్లో దాదాపు 95.58 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 12.42 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. వీకెండ్ క్యాష్ చేసుకోవడంలో తడబడింది భీమ్లా నాయక్. రెండో వీకెండ్ కేవలం రూ. 4.20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. రాధే శ్యామ్ రాకతో ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

    ఉత్తమ కథలు